బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల సర్వర్లను హ్యాక్ చేసి డబ్బులు కొట్టేసిన ఢిల్లీవాసి అరెస్ట్ అయ్యాడు. సర్వర్ హ్యాక్ చేసి ఇప్పటివరకు ఐదు కోట్లు కొట్టేసిన కేటుగాడికి అరదండాలు పడ్డాయి. చాలాకాలంగా తప్పించుకొని తిరుగుతున్న హ్యాకర్ ని ఎట్టకేలకు అరెస్ట్ చేశారు సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు. నిందితుడినుంచి 53 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ.. మొదటిసారి కరడుగట్టిన హాకర్ ను దేశంలోనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. హ్యాకర్ ఎలా ఆలోచిస్తారో మేము కనిపెట్టగలిగాం. రోజు వారీ కేసుల నమోదులో 20శాతం సైబర్ క్రైమ్ కేసులే వుంటున్నాయన్నారు. సైబర్ క్రైమ్ స్టేషన్ లో రోజుకు 100కేసులు వస్తే అందులో హ్యాకింగ్ కేసు లు సైతం నమోదు అవుతున్నాయన్నారు.
భవిష్యత్ పోలీసింగ్ విచారణలో రూపులేఖలు మారనున్నాయి. మహేష్ బ్యాంక్ కేసు తరహాలో ఈ హ్యాకింగ్ కేసును సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదించారు. హ్యాకర్ పేరు శ్రీరామ్ దినేష్ ఇంజనీరింగ్ డ్రాప్ అవుట్ విద్యార్థి. దినేష్ కుమార్ కు చిన్నప్పటి నుంచి కంప్యూటర్స్ అంటే మోజు. దినేష్ కంప్యూటర్లలో బగ్స్ కనిపెట్టడంలో దిట్ట. విజయవాడలో మూడు కంపెనీలు స్టార్ట్ చేశారు. 2021లో బెస్ట్ పే అనే యాప్ గుర్గావ్ లో ఉంది దాని నుంచి లక్షలు కొల్లగొట్టారు. దినేష్ పై ఢిల్లీ- గుర్గావ్ పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయన్నారు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్.
ఇలాంటి కేసులు ఇండియాలో ఎవరూ పట్టుకోలేదు హైదరాబాద్ పోలీసులే మొదటి సారి పట్టుకున్నారు. బ్యాంకు హ్యాకింగ్ చేస్తే దొరుకుతామని పేమెంట్ గేట్ వే ద్వారా 53లక్షలు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఫేక్ డాకుమెంట్స్ ఇచ్చి మూడు అకౌంట్లలోకి 53 లక్షలు బదిలీ చేశాడు. ఎథికల్ హకర్స్ సేవలను మేము ఇప్పటికే వాడుతున్నాం..వాళ్ళను మళ్ళీ ఈ కేసులో ఉపయోగించాం. ఇప్పటికే 18లక్షలు రికవరీ చేశాం.. ఇంకా అకౌంట్ నుంచి 13లక్షలు వస్తాయి. గడిచిన మూడు లేదా నాలుగు ఏళ్లలో 5కోట్లు బదిలీ చేసినట్లు ఒప్పుకున్నాడు. దినేష్ ఓ కస్టమర్ లాగా ముందు గేట్ వే లోకి ఎంటర్ అవుతాడు. ఎటువంటి లావాదేవీలు జరుగుతున్నాయి అని అవగాహన తెచ్చుకుంటాడు.
Somu Veerraju: ఏపీలో విద్య, వైద్యం అధ్వాన్నం
ఫేక్ సెల్ ఫోన్లు, ప్రూఫ్ లు ఇచ్చి మూడు అకౌంట్స్ ఓపెన్ చేసాడు. దోచేసిన నగదు తో బిట్ కాయిన్స్ అకౌంట్ తీసుకున్నాడు www.bitcoiva.com. అక్కడ కూడా దొరక్కుండా వేరే బిట్ కాయిన్స్ కొని అక్కడ అవి అమ్మి సాధారణ నగదుగా మార్చుకుంటాడు. మేము ప్రైవేట్ గా ఎథికల్ హ్యాకర్ లని అపాయింట్ చేసుకున్నాం. లొకేషన్ జార్ఖండ్,విజయవాడ వంటి లోకేషన్లు చూపించాయి. ఇప్పుడు 18 లక్షలు రికవరీ అయ్యింది.. ఇంకో 15 లక్షలు అతని బ్యాంక్ లో ఉన్నాయి అవి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. పేమెంట్ గేట్ వే కి చాలా నిబంధనలు ఉన్నాయి. ఆర్ బీ ఐ కూడా వీటి పై రెగ్యులేషన్ చెక్ చేస్తుంది. ఇప్పటి వరకు 3 కోట్లు దోచేసాడని, ప్రజలు అప్రమత్తంగా వుండాలని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సూచించారు.