బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల సర్వర్లను హ్యాక్ చేసి డబ్బులు కొట్టేసిన ఢిల్లీవాసి అరెస్ట్ అయ్యాడు. సర్వర్ హ్యాక్ చేసి ఇప్పటివరకు ఐదు కోట్లు కొట్టేసిన కేటుగాడికి అరదండాలు పడ్డాయి. చాలాకాలంగా తప్పించుకొని తిరుగుతున్న హ్యాకర్ ని ఎట్టకేలకు అరెస్ట్ చేశారు సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు. నిందితుడినుంచి 53 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ.. మొదటిసారి కరడుగట్టిన హాకర్ ను దేశంలోనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు…