NTV Telugu Site icon

Hyderabad Metro: అలర్ట్‌.. చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో మూసివేత..

Metro Hyderabad

Metro Hyderabad

Hyderabad Metro: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. రెండు మెట్రో స్టేషన్లు రెండు గంటల పాటు మూసివేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో ప్రకటించింది. ఇవాళ సాయంత్రం 4:30 నుంచి 6:30 వరకు..అంటే 2 గంటలు.. చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్లను మెట్రో అధికారులు ప్రకటించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. సాయంత్రం 5 గంటలకు ముషీరాబాద్‌లో ప్రధాని మోదీ రోడ్‌షో ప్రారంభం కానుంది. ఆ తర్వాత సనత్‌నగర్, సికింద్రాబాద్, కంటోన్మెంట్, మలక్‌పేట్, యాకత్‌పురా, బహదూర్‌పురా, చాంద్రాయణగుట్ట, ఎల్‌బీ నగర్, మహేశ్వరం, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, ఉప్పల్, మేడ్చల్, అంబర్‌పేట్, ఖైరతాబాద్, నల్లి, కార్వాన్, శేర్లింగంపల్లి, చార్మినార్, రాజేంద్రనగర్ మీదుగా వెళ్లి గోషామహల్ వద్ద ముగుస్తుంది. దీంతో.. ఈ ప్రాంతాల్లోని మెట్రో స్టేషన్లు 15 నిమిషాల పాటు మూసివేయనున్నారు మెట్రో అధికారులు. ఈ ప్రాంతాల్లో ప్రయాణించే ప్రయాణికులు తమ ప్రయాణాన్ని తదనుగుణంగా ప్లాన్ చేసుకుని ప్రత్యామ్నాయ మార్గాలను తదనుగుణంగా ప్లాన్ వేసుకోవాలని సూచించారు. ప్రధాని భారీ ఎన్నికల రోడ్ షో దృష్ట్యా కేంద్ర బలగాలు భారీ భద్రతా ఏర్పాట్లు చేశాయి.

Read also: Revanth Reddy: నవంబర్ 30 న అల్లుడు హరీష్ కు.. మామ కేసీఆర్ కు బుద్ది చెప్పాలి

ట్రాఫిక్ ఆంక్షలు

* ప్రధాని మోదీ ఎన్నికల రోడ్ షో ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి కాచిగూడ క్రాస్ రోడ్ వద్ద వీర్ సావర్కర్ విగ్రహం వరకు కొనసాగనుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు ఈరోజు మధ్యాహ్నం 1 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అమలులో ఉంటాయి.

* ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు నుంచి నారాయణగూడ వైఎంసీఏ వైపు వచ్చే వాహనాలను వీఎస్‌టీ, బాగ్‌ లింగంపల్లి, క్రౌన్‌ కేఫ్‌ మీదుగా, హిమాయత్‌ నగర్‌ నుంచి నారాయణగూడ క్రాస్‌ రోడ్డు మీదుగా వచ్చే వాహనాలను హిమాయత్‌ నగర్‌ వై జంక్షన్‌ వద్ద ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌, సెమెటరీ, రామ్‌కోఠి మీదుగా డైవర్ట్ చేస్తున్నారు.

* ముషీరాబాద్‌ నుంచి ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు వైపు వచ్చే వాహనాలను రామనగర సాగర్‌లాల్‌ ఆస్పత్రి మీదుగా, హిందీ మహావిద్యాలయం నుంచి ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు వైపు వచ్చే వాహనాలను అజామాబాద్‌ క్రాస్‌ రోడ్డు మీదుగా, తెలుగు మాటల ఫ్లై ఓవర్‌ వైపు వచ్చే వాహనాలను కట్టమైసమ్మ లోయర్‌ ట్యాంక్‌బండ్‌ మీదుగా మళ్లించారు.

* ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, లిబర్టీ, హిమాయత్ నగర్ వై జంక్షన్ మీదుగా నారాయణగూడ క్రాస్ రోడ్డుకు వచ్చే వాహనాలను అశోక్ నగర్ మీదుగా మళ్లించారు. నారాయణగూడ శ్మశాన వాటిక నుంచి వచ్చే వాహనాలను రామ్‌కోఠి క్రాస్‌ రోడ్డు, భవన్‌ కళాశాల లేన్‌ మీదుగా మళ్లించారు.

MP K. Keshava Rao: ఈసీ మాకు లీగల్ నోటీస్ ఇస్తే దానికి మేము ఆన్సర్ ఇచ్చే వాళ్లం..