Site icon NTV Telugu

Rains: నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. 50 కి.మీ.వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం

Telangana Rains

Telangana Rains

Rains: రోహిణి కర్త కారణంగా ఎండలు, వడగాలుల తీవ్రత కొనసాగుతుందని, దీంతో రానున్న 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం నేడు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో మంగళవారం పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే 31 నుంచి వచ్చే నెల 3 వరకు తెలంగాణలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఎండలతో పాటు వర్షాలు కురుస్తున్నాయి. మధ్యాహ్న సమయంలో భానుడు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే సాయంత్రం లేదా రాత్రి వర్షం కురిసి వాతావరణం చల్లబడింది. దీంతో ఎండ వేడిమి నుంచి ప్రజలు కాస్త ఉపశమనం పొందుతున్నారు.

Read also: Astrology : మే 30, మంగళవారం దినఫలాలు

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం తేలికపాటి వర్షాలు కురిశాయి. దుండిగల్‌లో 3.8 మి.మీ, మహబూబ్‌నగర్‌లో 1.0 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈ ఉదయం వరంగల్‌లో వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా వరంగల్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అలాగే పలు పట్టణాల్లో చిరు జల్లులు కురుస్తున్నాయి. ఓ వైపు వర్షాలు, మరోవైపు ఎండల తీవ్రత పెరుగుతోంది. చాలా చోట్ల గరిష్ట ఉష్ణోగ్రత 44 డిగ్రీల వరకు నమోదవుతోంది. నిన్న ఖమ్మంలో అత్యధికంగా 43.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. దాదాపు అన్ని జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు పైగా, కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీలకు మించి నమోదైంది. తుపాను తీవ్రతతో పాటు వడగళ్ల వానలు, తుపాను ఉప్పెనలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని రోజులు ఎండలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. జూన్ వరకు ఎండలు, వర్షాలు కురుస్తాయని అంచనా. ఏపీలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి పలు చోట్ల వర్షాలు కురుస్తుండగా, ఈరోజు పలు జిల్లాలకు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది.
Gehlot vs Pilot: అశోక్‌, సచిన్‌ల మధ్య కుదిరిన రాజీ ఫార్ములా.. అర్ధరాత్రి వరకు సాగిన చర్చలు

Exit mobile version