Rains: నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. 50 కి.మీ.వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rains: రోహిణి కర్త కారణంగా ఎండలు, వడగాలుల తీవ్రత కొనసాగుతుందని, దీంతో రానున్న 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం నేడు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో మంగళవారం పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే 31 నుంచి వచ్చే నెల 3 వరకు తెలంగాణలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఎండలతో పాటు వర్షాలు కురుస్తున్నాయి. మధ్యాహ్న సమయంలో భానుడు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే సాయంత్రం లేదా రాత్రి వర్షం కురిసి వాతావరణం చల్లబడింది. దీంతో ఎండ వేడిమి నుంచి ప్రజలు కాస్త ఉపశమనం పొందుతున్నారు.
Read also: Astrology : మే 30, మంగళవారం దినఫలాలు
Also Read
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం తేలికపాటి వర్షాలు కురిశాయి. దుండిగల్‌లో 3.8 మి.మీ, మహబూబ్‌నగర్‌లో 1.0 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈ ఉదయం వరంగల్‌లో వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా వరంగల్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అలాగే పలు పట్టణాల్లో చిరు జల్లులు కురుస్తున్నాయి. ఓ వైపు వర్షాలు, మరోవైపు ఎండల తీవ్రత పెరుగుతోంది. చాలా చోట్ల గరిష్ట ఉష్ణోగ్రత 44 డిగ్రీల వరకు నమోదవుతోంది. నిన్న ఖమ్మంలో అత్యధికంగా 43.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. దాదాపు అన్ని జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు పైగా, కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీలకు మించి నమోదైంది. తుపాను తీవ్రతతో పాటు వడగళ్ల వానలు, తుపాను ఉప్పెనలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని రోజులు ఎండలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. జూన్ వరకు ఎండలు, వర్షాలు కురుస్తాయని అంచనా. ఏపీలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి పలు చోట్ల వర్షాలు కురుస్తుండగా, ఈరోజు పలు జిల్లాలకు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది.
Gehlot vs Pilot: అశోక్, సచిన్‌ల మధ్య కుదిరిన రాజీ ఫార్ములా.. అర్ధరాత్రి వరకు సాగిన చర్చలు
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..