NTV Telugu Site icon

IIIT Student: ఐఐటీ విద్యార్థి కార్తీక్ కథ విషాదాంతం.. విశాఖ ఆర్కే బీచ్ లో శవంగా తేలాడు..!

Karthik Dead

Karthik Dead

IIIT Student: ఐఐటీ విద్యార్థి కార్తీక్ మిస్సింగ్ కేసు విషాదంగా మారింది. విశాఖలోని ఆర్.కే బీచ్ లో కార్తీక్ సవమై కనిపించడంతో సంచలనంగా మారింది. ఈ నెల 17న క్యాంపస్ నుంచి బైటికి వెళ్లిన కార్తీక్ ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులో భాగంగా సీసీటీవీ ఫుటేజీ, ఫోన్ లొకేషన్‌ను పరిశీలించారు. ఈ నెల 17వ తేదీ రాత్రి 7 గంటలకు కార్తీక్ కళాశాల హాస్టల్ నుంచి బయటకు వచ్చినట్లు సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఆ తర్వాత క్యాబ్ ఎక్కి 9 గంటలకు లింగంపల్లి రైల్వేస్టేషన్ కు చేరుకుని లోకల్ ట్రైన్ లో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు చేరుకున్నాడు. 18వ తేదీ ఉదయం 6 గంటలకు జన్మభూమి ఎక్స్ ప్రెస్ ఎక్కి వైజాగ్ వెళ్లారు.

Read also: Dhanush: జులై 28 ధనుష్ సోషల్ మీడియాని కబ్జా చేయనున్నాడు…

19వ తేదీ ఉదయం నుంచి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసినట్లు సీసీటీవీ విజువల్స్ లో తేలింది. ఆరోజే విశాఖకు కార్తీక్ తల్లిదండ్రులు, సంగారెడ్డి పోలీసులు బయలు దేరి వెళ్ళారు. 20 నాడు మూడు గుర్తు తెలియని డెడ్ బాడీ లు మార్చురీలో ఉన్నాయని చెప్పిన విశాఖ పోలీసులు. భయంతో డెడ్ బాడీని చూడటానికి ధైర్యం చాలక.. కార్తీక్ తల్లిదండ్రులు బంధువులను పంపారు. ఆరు రోజులైనా కార్తిక్ ఆచూకీ లభించకపోవడంతో నిన్న తల్లిదండ్రులు మార్చురీకి వెళ్ళారు. 24న (నిన్న) రాత్రి కార్తీక్ మృతదేహాన్ని తల్లిదండ్రులు గుర్తుపట్టి బోరున ఏడ్చారు. కన్నపేరు శవమై కనిపించడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. కార్తీక్ మృతదేహాన్ని నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని వాటర్ ట్యాంక్ తండాకు తరలించారు. కార్తీక్‌ ఇంజినీరింగ్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇతని స్వస్థలం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ట్యాంక్ తండా. బీటెక్ ద్వితీయ సంవత్సరంలో రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయినట్లు సమాచారం. పరీక్షల్లో ఫెయిల్ అయ్యాననే బాధతో ఆత్మహత్య చేసుకున్నాడా? పోలీసులు విచారిస్తున్నారు.
Rat Death: ఇదేందయ్యో ఇది.. ఎలుకను చంపిన వ్యక్తి అరెస్ట్! అసలు ట్విస్ట్ ఏంటంటే?