తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అర్ధరాత్రి నుండి వర్షాలు కురుస్తుండడంతో జనజీవనం స్థంభించింది. దీంతో ప్రధార రోడ్లన్ని జలమయమయ్యాయి. కోఠీ ENT ఆసుపత్రి లోపలి వరకు వరద నీరు వచ్చి చేరింది. ఆస్పత్రి చూట్టూరా పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో. . చెరువును తలపిస్తుంది. ఆస్పత్రి లోపలకి వరద నీరు రావడంతో పేషెంట్లు, సిబ్బంది ఇబ్బంది పడ్డారు. నగరంలోని పలుచోట్ల వర్షం దంచి కొడుతుంది. దీంతో జనాలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వర్షం పెరిగే కొద్ది రోడ్లపై వరద నీరు వచ్చి చేరుతుంది. ఆఫీసులకు వెళ్లే సమయం అవ్వడంతో వర్షంతో ఉద్యోగుల ఇక్కట్లు పడుతున్నారు. ఎల్బీ నగర్, కొత్తపేట, చైతన్యపురి, హయత్నగర్, ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుంది. దిల్ సుఖ్ నగర్, , బోరబండ, కూకట్ పల్లి, జూబ్లీహిల్స్, గోల్నాక, ముషీరాబాద్, సికింద్రాబాద్, నాంపల్లి, అప్జల్ గంజ్ తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది.