Traffic Diversion : నగరంలో గణేష్ నిమజ్జన మహోత్సవాలను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు భారీ స్థాయిలో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నారు. నేటి (ఆగస్టు 29) నుండి సెప్టెంబర్ 5 వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి. ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి అర్ధరాత్రి వరకు వాహన రాకపోకలపై పరిమితులు ఉండనున్నాయి. పోలీసుల ప్రకారం, ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, పీవీఎన్ఆర్ మార్గ్ వద్ద వినాయక విగ్రహాల నిమజ్జనం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో భారీగా వాహనాల రాకపోకలు ఉండే అవకాశం ఉన్నందున మోటార్ వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు.
“సుగాలి ప్రీతి తల్లి ఆరోపణలపై పవన్ కళ్యాణ్ స్పందన”
ప్రధాన రూట్లపై ఆంక్షలు
సెయిలింగ్ క్లబ్ జంక్షన్, వీవీ విగ్రహం, తెలుగు తల్లి జంక్షన్, డీబీఆర్ మిల్స్, కవాడిగూడ ఎక్స్ రోడ్, నల్లగుట్ట బ్రిడ్జి, బుద్ధభవన్ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు.
అప్పర్ ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ మీద అవసరాన్ని బట్టి వాహనాలను అడ్డుకోవచ్చు.
లిబర్టీ, ఖైరతాబాద్, సికింద్రాబాద్, పంజాగుట్ట వైపు వచ్చే వాహనదారులు కవాడిగూడ, బేగంపేట్, మినిస్టర్ రోడ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా వెళ్ళాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
వాహనదారులకు సూచనలు
నిమజ్జన కార్యక్రమాలు సాఫీగా సాగేందుకు ట్రాఫిక్ నియమాలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేకించి పీక్ టైమ్‌లో వాహనాలు తీసుకెళ్లేటప్పుడు ఆంక్షలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రజలు గణేష్ నిమజ్జన ప్రాంతాలకు వెళ్లేటప్పుడు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను వినియోగించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు నగరవాసులకు “అవసరమైతే మాత్రమే నిమజ్జన ప్రాంతాలకు వెళ్లండి. ట్రాఫిక్ ఆంక్షలను గౌరవించండి. పోలీసులకు సహకరించండి” అని విజ్ఞప్తి చేశారు.
Vizianagaram News: హృదయవిదారక ఘటన.. తల్లికి పురుడు పోసిన కూతురు!
