Site icon NTV Telugu

Ganesh Visarjan 2025 : డీజే బాణీలకు పోలీస్ అధికారులు స్టెప్పులు

Police Dance In Ganesh Nima

Police Dance In Ganesh Nima

Ganesh Visarjan 2025 : హైదరాబాద్‌ నగర వ్యాప్తంగా గణేశ్‌ నిమజ్జనాలు ఉత్సాహభరితంగా, ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. డీజేలు, బ్యాండ్లు, కోలాటాలు, డప్పుల మోతలు, సాంస్కృతిక ప్రదర్శనల నడుమ భక్తులు భారీగా ట్యాంక్‌బండ్ వైపు తరలివస్తున్నారు. శోభాయాత్రలో చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఉత్సాహంగా పాల్గొని వినాయకుడి నిమజ్జనాన్ని పండగలా మార్చుతున్నారు.

AP Liquor Scam: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. ఎంపీ మిథున్ రెడ్డి విడుదల.. ఆ ముగ్గురికి బెయిల్!

ఈ సందర్భంలోనే ఒక ఆసక్తికర దృశ్యం కనిపించింది. డీజే పాటల బాణీలకు పోలీసు సిబ్బంది ఊరేగింపులో పాల్గొని డ్యాన్స్ చేశారు. ముఖ్యంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్రలో ఏసీపీ సంజయ్ నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఆయనతో పాటు పలువురు పోలీస్ అధికారులు కూడా భక్తులతో కలిసి డ్యాన్స్ చేస్తూ, అక్కడి వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చారు. భక్తుల మధ్యే కలిసిపోయి, ఆనందంగా స్టెప్పులు వేస్తున్న పోలీసుల వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇక నిమజ్జన కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ మార్గ్ వద్ద ఏర్పాటు చేసిన క్రేన్ నెంబర్ 4 ద్వారా 69 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహా గణపతిని హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేశారు. మరోవైపు నగరంలోని వివిధ మండపాల నుండి వేలాది గణేశులు నిమజ్జనం కోసం హుస్సేన్ సాగర్ వైపు తరలివస్తున్నారు. ఫలితంగా ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసి, పండుగ వాతావరణాన్ని సృష్టించాయి. మొత్తం మీద, గణేశ్‌ నిమజ్జనాల వేడుకలు ఈ ఏడాది కూడా ఉత్సాహంగా, భక్తిశ్రద్ధలతో పాటు వినోదాత్మకంగా సాగుతున్నాయి.

Ustad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ అప్పుడేనట..

Exit mobile version