Site icon NTV Telugu

Rave Party : హైదరాబాద్ గచ్చిబౌలిలో రేవ్ పార్టీ భగ్నం.. డిప్యూటీ తహసీల్దార్ సహా పలువురు

Rave Party

Rave Party

Rave Party : హైదరాబాద్ నగరంలో మరోసారి రేవ్ పార్టీ బస్టింగ్ జరిగింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈగల్ టీమ్, గచ్చిబౌలి పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి డ్రగ్స్ వాడుతున్న పలువురిని పట్టుకున్నారు. హైదరాబాద్ మాదాపూర్ డీసీపీ వినీత్ వెల్లడించిన వివరాల ప్రకారం, గచ్చిబౌలి ఈగల్ టీమ్, స్థానిక పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి రాజేశ్వరి నిలయం అనే సర్వీస్ అపార్ట్మెంట్‌లో జరుగుతున్న రేవ్ పార్టీపై దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురిని అదుపులోకి తీసుకొని పెద్ద ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.

Nara Rohith: నేనూ పవన్ లాగే.. పాలిటిక్స్ పై నారా రోహిత్ షాకింగ్ కామెంట్స్

అరెస్ట్ అయిన వారిలో క్లౌడ్ కిచెన్ యజమాని తేజ, పౌల్ట్రీ వ్యాపారి విక్రమ్, ఐటీ ఉద్యోగులు నీలిమ, భార్గవ్, వైన్ షాప్ వ్యాపారి మరియు డ్రగ్స్ వినియోగదారుడు పురుషోత్తం రెడ్డి, అలాగే ట్రాన్స్‌పోర్టర్ చందన్ ఉన్నారు. వీరి వద్ద నుంచి పోలీసులు 20 గ్రాముల కొకైన్, 8 ఎక్స్టసీ గుళికలు, 3 గ్రాముల MDMA స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో బెంగళూరుకు చెందిన డ్రగ్ సరఫరాదారు రాహుల్ అలియాస్ సోను, డిప్యూటీ తహసీల్దార్ మణిదీప్ పరారీలో ఉన్నారు. విచారణలో రాహుల్‌కు నైజీరియన్ డ్రగ్ సరఫరాదారు మైక్ లింకులు ఉన్నట్లు తేలింది. చందన్ అనే ట్రాన్స్‌పోర్టర్ ద్వారా రాహుల్ నుండి డ్రగ్స్ తెచ్చి తేజ, విక్రమ్, నీలిమలకు సరఫరా చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Anupama: కమర్షియల్ సినిమాలో 1000 తప్పులున్నా పట్టించుకోరు.. మా సినిమాకి మాత్రం ఇలానా!

తేజ, విక్రమ్, నీలిమ ముగ్గురూ కలిసి గోవా, రాజమండ్రిలో రేవ్ పార్టీలు నిర్వహించేవారని, ముఖ్యంగా మణిదీప్ రాజమండ్రిలో తన సొంత ఫామ్ హౌస్‌లో తరచూ పార్టీలను ఏర్పాటు చేసేవాడని తెలిసింది. గోవాలో కూడా ఈ బృందం పలు పార్టీలను నిర్వహించింది. నీలిమ, తేజ, విక్రమ్‌లకు డ్రగ్స్ అలవాటు చేయడంలో మణిదీప్ కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. క్లౌడ్ కిచెన్ వ్యాపారంలో నష్టాలు వచ్చిన తర్వాత తేజ రేవ్ పార్టీలే ప్రధాన ఆదాయ మార్గంగా ఎంచుకున్నాడు. ఈ బృందం గోవా నుండి డ్రగ్స్‌ను “బ్లూటో థియాన్” ఇంజెక్షన్ కవర్లో దాచుకుని తెచ్చినట్లు విచారణలో బయటపడింది. ఇక విక్రమ్, మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్యకు సన్నిహితుడు కావడం కూడా ఈ కేసులో మరో ఆసక్తికర అంశంగా వెలుగుచూసింది.

Exit mobile version