Nara Rohith: నేనూ పవన్ లాగే.. పాలిటిక్స్ పై నారా రోహిత్ షాకింగ్ కామెంట్స్
- నారా రోహిత్ హీరోగా సుందరకాండ సినిమా
- ఆగస్టు 27న వినాయక చవితి సందర్భంగా విడుదల
- రాజకీయాలపై నారా రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు
- ఇంట్రోవర్ట్‌గా ఉన్నా పాలిటిక్స్‌లో రాణిస్తానని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నారా రోహిత్ హీరోగా నటించిన సుందరకాండ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమైంది. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా బుధవారం, ఆగస్టు 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే, ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నారా రోహిత్ చాలా విస్తృతంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఆయన ప్రింట్ మరియు వెబ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా నారా రోహిత్‌కు రాజకీయాల గురించి ఒక ప్రశ్న ఎదురైంది. “మీరు రాజకీయాల మీద ఆసక్తితో ఉన్నానని చెప్పారు.
Also Read:ఫ్యాషన్ క్వీన్‌గా మారిన పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియా హీట్ పెంచింది
Also Read
అయితే మీలాంటి ఇంట్రోవర్ట్ రాజకీయాలకు సూట్ అవుతారని అనుకుంటున్నారా? ఎందుకంటే అక్కడ పొలిటికల్‌గా ముఖం మీద కొట్టినట్లు విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి,” అని ప్రశ్నించగా, దానికి నారా రోహిత్ స్పందిస్తూ ఇలా అన్నారు, “నా పెదనాన్న పొలిటికల్‌గా ఏ స్థాయిలో ఉన్నారో మీ అందరికీ తెలుసు. నేను ఆ కుటుంబం నుంచి వచ్చాను. అలాగే, నేను ఇంట్రోవర్ట్ అయినంత మాత్రాన పాలిటిక్స్‌లో సెట్ కాను అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా సినిమాల్లో ఉన్నంతవరకు ఇంట్రోవర్ట్‌గానే ఉన్నారు. ఎప్పుడైతే రాజకీయాల్లోకి వెళ్లారో, అప్పుడు ఆయన తనదైన శైలిలో దూసుకుపోయారు. నేను కూడా రాజకీయాల్లోకి వెళితే, దీటైన విధంగా సమాధానం ఇచ్చే అవకాశం ఉంది,” అంటూ ఆయన మాట్లాడారు. ఇక నారా రోహిత్ సరసన ఈ సినిమాలో శ్రీదేవి విజయ్ కుమార్‌తో పాటు వృత్తి వాగాని హీరోయిన్‌లుగా నటించారు. ఒక ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని టీమ్ చెబుతోంది.
తాజావార్తలు
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!