Hyderabad Flight landed in Karachi: పాక్ లో ల్యాండ్ అయిన హైదరాబాద్ విమానం.. ప్రతి సారి ఎందుకిలా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్యాకాలంలో కరాచీలో ల్యాండ్? హైదరాబాద్ నుంచి వెళ్లిన విమానాలకు సాంకేతిక లోపం? పాకిస్తాన్ పరిసర ప్రాంతాల్లోనే సమస్యలు? ముందుగానే సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుని జాగ్రత్తలు పాటించినా కరాచీ లోనే ల్యాండింగ్ ఎందుకు? అసలు సమస్య ఏమిటి? ఏం జరుగుతోంది?
హైదరాబాద్ నుంచి బయలు దేరిన విమానాలు పాక్ లో ల్యాండ్ అవడం పై సర్వత్రా కలకలం రేపుతోంది. ప్రయాణికులతో బయలుదేరిన పలు అంతర్జాతీయ విమానయాన సంస్థలకు చెందిన విమానాలు.. ఇటీవల తరచుగా అత్యవసరంగా ల్యాండ్ అవుతుండటం ప్రయాణికుల్లో అలజడి సృష్టిస్తోంది. అయితే.. అధికారులు మాత్రం వివిధ సాంకేతిక సమస్యలు కారణంగా ల్యాండ్ చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. ఈ ఘటనలపై జులైలోనే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విచారణకు ఆదేశించారు కూడా. అయినా మళ్లీ హడావుడిగా నిన్న 12 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సోమవారం బయలుదేరింది. నిన్న మధ్యాహ్నం 12.10 గంటలకు కరాచీలోని జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో దిగింది. కొద్దిసేపటికి మళ్లీ అది 12 మంది ప్రయాణికులతో అక్కడి నుంచి బయలుదేరింది. దీనికి కారణాలేంటన్నది స్పష్టంకాలేదని పాక్ వర్గాలు తెలిపాయి.
Also Read
- DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
- IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
2022 జులై 5 ఫ్యూయల్ ఇండికేటర్ సమస్యః
భారత ఎయిర్‌లైన్స్ కు చెందిన విమానం ఆకస్మికంగా కరాచీలో ల్యాండ్ అవడం గమనార్హం. దిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న స్పైస్‌జెట్ విమానాన్ని కూడా జులై 5న హడావుడిగా పాక్ లోని కరాచీకి మళ్లించాల్సి వచ్చింది. దానికి కారణం ఫ్యూయల్ ఇండికేటర్ సరిగా పనిచేయలేదని అధికారులు తెలిపారు. కాగా.. ఆ ఎస్జీ-11 విమానంలో మొత్తం 150 మంది ప్రయాణికులు ఉన్నారు. స్పైస్‌జెట్ విమానంలోని ప్రయాణికులు కరాచీ నుంచి దుబాయి వెళ్లేందుకు వీలుగా మరో ఫ్లైట్‌ను భారత్ నుంచి పంపారు. అంతవరకు ప్రయాణికులు ఎవరూ ఇబ్బంది పడకుండా వారికి అవసరమైన ఏర్పాట్లు చేశారు
2022 జులై 15న హైడ్రాలిక్ సమస్యః
షార్జా నుంచి కొచ్చికి బయలుదేరిన జీ9-426 విమానంలో హైడ్రాలిక్ సమస్య తలెత్తి.. మొదలైన కిద్దిసేపటికే రన్‌వేపైన పైలట్లు నిలిపివేశారు. జులై 15న అడిస్ అబాబా నుంచి బ్యాంకాక్‌కు బయలుదేరిన ఎయిర్‌లైన్స్ విమానం పలు కారణాలు వల్ల కోల్‌కతా విమానాశ్రయానికి మళ్లించారు అధికారులు. అదే రోజు, శ్రీలంక ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానాన్ని చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. తాజాగా ఆదివారం.. షార్జా నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం పాకిస్థాన్ లోని కరాచీ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయింది.
2022 జులై 17 సాంకేతిక లోపం
షార్జా నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం పాకిస్థాన్‌లోని కరాచీ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయింది. సాంకేతిక లోపాన్ని ముందే గుర్తించి అప్రమత్తమైన పైలట్.. విమానాన్ని సమీపంలోని కరాచీకి మళ్లించినట్లు ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రయాణికుల్ని హైదరాబాద్ రప్పించేందుకు భారత్ నుంచి పంపిన మరో విమానం కరాచీ చేరుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. విమానంలో మొత్తం 125 మందిని సురక్షితంగా హైదరాబాద్ చేర్చనున్నట్లు పేర్కొంది.
అయితే కొందరు మాత్రం సాంకేతిక లోపాలు గత నెల నుంచి ఎందుకు అవుతున్నాయి దాని గుర్తించడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. కరాచీ ప్రాంతాల్లోనే ఎందుకు సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి? అసలు విమానం ఇక్కడ నుంచి బయలు దేరేప్పుడు రాని లోపాలు పాక్ పరిసర ప్రాంతాల్లోనే ఎందుకు వస్తున్నాయి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గత మాసం నుంచి ఇలాంటివి తలెత్తుతున్నా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విచారణకు ఆదేశించిన ఇప్పటికి ఎలాంటి సమాచారం లేకపోవడం గమనార్హం. ఇప్పటికైనా అధికారులు ఎందుకు అలా జరుగుతోంది అనే నేపథ్యంలో చర్యలు చేపట్టాలని, విచారణ జరిపించాలని ప్రయాణికులు, పలువురు కోరుతున్నారు.
Subhas Chandra Bose: మిస్టరీగానే సుభాష్ చంద్రబోస్ మరణం.. తెరపైకి కొత్త డిమాండ్
తాజావార్తలు
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!