Eagle Force: హైదరాబాద్‌లో ఈగిల్ ఫోర్స్ మెరుపు దాడి.. 75 ఏళ్ల వృద్ధురాలు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eagle Force: హైదరాబాద్ నగరంలో మాదకద్రవ్యాల కట్టడిపై తెలంగాణ ఈగిల్ ఫోర్స్ (EAGLE Force) ఉక్కుపాదం మోపింది. ఫతేనగర్ పరిధిలోని ఎల్బీఎస్ నగర్లో ఓ నివాస గృహం కేంద్రంగా సాగుతున్న అక్రమ గంజాయి దందాను ఈగిల్ ఫోర్స్ పోలీసులు బట్టబయలు చేశారు. ఇంట్లోనే గంజాయి నిల్వ ఉంచి విక్రయిస్తున్న 75 ఏళ్ల షేక్ జథేన్ బీ అనే వృద్ధురాలిని అరెస్ట్ చేశారు. ఈ దాడిలో గంజాయి కొనడానికి వచ్చిన దాదాపు 70 మంది వినియోగదారులను గుర్తించారు. ఫతేనగర్‌లోని నివాసంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయన్న విశ్వసనీయ సమాచారంతో ఈగిల్ ఫోర్స్‌కు చెందిన హైదరాబాద్ నార్కోటిక్ పోలీస్ స్టేషన్ బృందం రాత్రి వేళ ఆకస్మిక సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో నిందితురాలి వద్ద నుంచి 179.1 గ్రాముల బరువు గల 41 చిన్న గంజాయి ప్యాకెట్లు, రూ. 43,340 నగదు, ఒక మొబైల్ ఫోన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలు చిన్న చిన్న పొట్లాలుగా మార్చి వినియోగదారులకు విక్రయిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
ఈ నివాసంతో సంబంధం ఉన్న 70 మంది గంజాయి వినియోగదారులను గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించగా, 66 మందికి గంజాయిలోని ప్రధాన మత్తు పదార్థమైన ‘టీహెచ్‌సీ’ (THC) పాజిటివ్‌గా తేలింది. వీరిలో ముగ్గురు మైనర్లు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గుర్తించిన వారిలో 65 మందిని వివిధ డీ-అడిక్షన్/పునరావాస కేంద్రాలకు తరలించారు. ఈ దందాలో అరెస్టయిన వృద్ధురాలితో పాటు మరో ఐదుగురు సహచరుల పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం మున్నీ బేగం, ఇమ్రాన్, హనీఫా బీ, ఖాజా బీ అలియాస్ గిడ్డి, షేక్ ఖాజా పాషా పరారీలో ఉన్నారు. వీరికి గంజాయి ఎక్కడి నుంచి సరఫరా అవుతోంది? వెనుక ఉన్న నెట్వర్క్ ఏమిటి? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Also Read
- Honey Trap: ఇన్‌స్టాలో అమ్మాయి పేరుతో నకిలీ ప్రొఫైల్.. దేశవిదేశాల్లోని యువకులను ముంచేసిన కేటుగాడు..
- Tummidihatti Barrage: తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై మహారాష్ట్ర సీఎం సానుకూల స్పందన..
- Software Engineer S*uicide: ‘పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతా’.. ప్రియుడికి వీడియో కాల్ చేసి సాఫ్ట్వేర్ ఇంజినీర్ అర్చన ఆత్మహత్య.!
- Supreme Court: గచ్చిబౌలి కంచ గచ్చిబౌలి అటవీ ప్రాంత వివాదం.. సుప్రీంకోర్టు ఇవాళ తుది తీర్పు
అరెస్టయిన నిందితురాలు షేక్ జథేన్ బీ (75)పై గతంలో బాలానగర్ (Cr.No.161/2017, 89/2024, 154/2024), సనత్‌నగర్ (Cr.No.782/2022), అమీర్‌పేట ఎక్సైజ్ (Cr.No.79/2024, 45/2025), బేగంపేట (Cr.No.275/2025) పోలీస్ స్టేషన్లలో ఏడు ఎన్డీపీఎస్ కేసులు నమోదై ఉన్నాయి. మైనర్లకు గంజాయి సరఫరా చేయడం, విక్రయించడం తదితర నేరాలపై క్రైమ్ నం. 23/2026 కింద NDPS చట్టంలోని సెక్షన్ 8(c) r/w 20(b)(ii)(A), 27(b) మరియు జువెనైల్ జస్టిస్ (JJ) చట్టంలోని సెక్షన్ 77 కింద కేసు నమోదు చేశారు. మైనర్లను చట్టపరమైన నిబంధనల ప్రకారం పునరావాసానికి పంపినట్లు అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Eagle Force: హైదరాబాద్‌లో ఈగిల్ ఫోర్స్ మెరుపు దాడి.. 75 ఏళ్ల వృద్ధురాలు అరెస్ట్
-
Fake Bomb Threat Case: 800 బాంబు బెదిరింపులు.. చివరకు చెన్నైలో చిక్కిన నిందితుడు!
-
Honey Trap: ఇన్‌స్టాలో అమ్మాయి పేరుతో నకిలీ ప్రొఫైల్.. దేశవిదేశాల్లోని యువకులను ముంచేసిన కేటుగాడు..
-
Srinidhi Shetty: వెంకటేష్ కామెడీ టైమింగ్‌ను మ్యాచ్ చేయడం నా వల్ల కాలేదు
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
ట్రెండింగ్
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!
-
ఇంట్లోనే హోమ్ థియేటర్.. TCL 65 అంగుళాల 4K Google TV పై రూ. 60,000 భారీ డిస్కౌంట్..!