Hyderabad cp srinivas reddy: డ్రగ్ ఫ్రీ సిటిలో స్కూల్స్ దే కీలక పాత్ర అని హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమాన్ని మూడు కమిషనరేట్ల పరిధిలోని స్కూల్ చిల్డ్రన్, పేరెంట్స్ కోసం ఏర్పాటు చేశామన్నారు. ఎంతో మంది మేధావులను తీర్చిదిద్థడంలో కీలకపాత్ర పోషించింది గురువులే అన్నారు. నేను గతంలో చాలా వార్తలు చూశాను, డ్రగ్స్ ఇప్పుడు స్కూల్ పిల్లల వరకు చేరాయని అన్నారు. ఇది చాలా ఆందోళనకరమన్నారు. పాన్ డబ్బాలో కూడా ఇప్పుడు దొరికేంత పరిస్థితి వచ్చిందన్నారు. అర్భన్ ఏరియాలలోనే కాదు రూరల్ ఏరియాలలోకి పాకిందని తెలిపారు. దేశం మొత్తం మీద ప్రభావం చూపిస్తుందన్నారు. డ్రగ్స్ లావాదేవీల నుండి వచ్చే డబ్బును టెర్రరిజంకు వాడుతున్నారని, డ్రగ్ ఫ్రీ సిటిలో స్కూల్స్ దే కీలక పాత్ర అని తెలిపారు.
విద్యార్థులకు విద్యాబుద్ధులతో పాటు సమాజంలో ఎదురయ్యే మంచి, చెడులను వివరించాలని అన్నారు. స్టూడెంట్ ను కమర్షియల్ ప్రొడక్ట్ గా కాకుండా బాధ్యాతాయుతమైన పౌరుడిగా స్కూల్స్ తీర్చిదిద్దాలన్నారు. ఎడ్యుకేషన్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ పైనే దృష్టి సారించొద్దన్నారు. యాంటీ డ్రగ్ కిమిటీలను స్కూల్స్ లో ఏర్పాటు చేసుకోవాలన్నారు. టీచింగ్ స్టాఫ్ తో పాటు నాన్ టీచింగ్ స్టాఫ్ తో యాంటీ డ్రగ్ కమిటిని ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులను చైతన్యవంతులను చేయాలని తెలిపారు. చాక్లెట్ల రూపంలో ఇటీవల.కాలంలో నగర శివార్లలో అమ్మూతుండటం చూశామని, వీటిపై విద్యార్థుల్లో అవగాహన కల్పించాలని అన్నారు.
Read also: Burra Venkatesham: యాంటి డ్రగ్ కమిటి స్కూళ్ళలలో పెట్టాలి కానీ.. ఆ పేరు ఉండకూడదు..!
స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన మాట్లాడుతూ.. ఇలాంటి సందర్భం వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదన్నారు. చెడు వ్యసనాలకు పిల్లలు బానిసలుగా మారితే ఏ పేరెంట్స్ గుండె తట్టుకోలేదన్నారు. ప్రైవేటు పాఠశాలలో చెడు వ్యసనాలకు అలవాటు.పడ్డ పిల్లలకు.సంబంధించిన కేసులు ఉన్నాయన్నారు. ఇప్పుడు ప్రభుత్వ పాఠాశాలల వరకు చేరిందని తెలిపారు. చాక్లెట్ల రూపంలో పిల్లలకు డ్రగ్స్ అలవాటు చేస్తున్నారని, పిల్లలు చెడ్డదారిలో పడుతున్నారంటే సమాజం బాధ్యత అన్నారు. హైదరాబాద్ లో చాలా సులభంగా డ్రగ్స్ దొరుకుతున్నాయని, ఫ్రైవేట్ స్కూల్ టీచర్లు విద్యార్థుల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారో చూడాలన్నారు. క్లాస్ రూమ్ లలో టీచర్లదే కీలక పాత్ర అన్నారు. ఇప్పడు ఉన్న సమస్యను పరిష్కరించేందుకు పోరాడాలి తప్ప తప్పించుకోవద్దని సూచించారు.
Bhatti Vikramarka: గుడ్ న్యూస్.. 119 నియోజకవర్గాల్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నాలెడ్జి కేంద్రాలు..