అతిభారీ వర్షాలు.. హైదరాబాద్, సైబరాబాద్ సీపీల కీలక సూచనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్‌తో హైదరాబాద్‌తో తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.. హైదరాబాద్‌లో ఇవాళ ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది.. ఇక, సాయంత్రం నుంచి కుండపోత వర్షం కురుస్తున్న నేపథ్యంలో.. హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు కీలక సూచనలు చేశారు.. సైబరాబాద్ కమీషనరేట్లో సిబ్బందిని అలర్ట్ చేసినట్టు తెలిపారు సీపీ స్టీఫెన్ రవీంద్ర.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాలపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన సీపీ.. మరో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు, సిబ్బందికి ఆదేశాలిచ్చారు. విద్యుత్ సమస్యలు వస్తే కంట్రోల్ రూమ్ నంబర్లు.. 9490617100, 8331013206, 040-278534183, 040-27853412, టోల్‌ఫ్రీ నెంబర్ 1912 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని.. పోలీసుల సహాయం కోసం డయల్ 100కు కాల్ చేయాలని సూచించారు సీపీ స్టీఫెన్ రవీంద్ర.
మరోవైపు.. భారీ వర్షాలపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్.. పోలీస్ అధికారులు, సిబ్బందితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో సిటీ ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. ఎలాంటి సమస్య వచ్చినా 100 నంబర్‌కు డయల్ చేయాలని సూచించారు. పెట్రోలింగ్, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. నగరంలోని లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు సీపీ అంజనీకుమార్.
Also Read
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
తాజావార్తలు
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!