Site icon NTV Telugu

హుజురాబాద్ ఓటర్లు చైతన్యం చాటారు : హరీశ్‌రావు

minister harishrao

ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన హుజురాబాద్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ విజయవంతంగా ముగిసింది. అయితే కొన్నిచోట్ల స్వల్ప వాగ్వాదాలు చోటు చేసుకున్నప్పటికీ మినహా పోలింగ్‌ ప్రక్రియ హుజురాబాద్‌ నియోకవర్గంలో ప్రశాంతంగా ముగిసింది. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మాట్లాడుతూ.. హజురాబాద్‌ ఓటర్లు చైతన్యం చాటారని ప్రశంసించారు.

కేసీఆర్ మార్గదర్శకత్వం, హుజురాబాద్ ప్రజల ఆశీస్సులతో గొప్ప విజయం సాధించబోతున్నామని అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఉప ఎన్నిక ఓటింగ్ లో పాల్గొన్న ఓటర్లకు ధన్యవాదాలు తెలిపిన హరీశ్‌రావు, కష్టపడ్డ పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఓ రెండు పోలింగ్‌ స్టేషన్‌లో ఇంకా పోలింగ్‌ జరుగుతోంది.

Exit mobile version