హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో వ్యవహరించినట్టే టీఆర్ఎస్ మునుగోడు విషయంలో అనుసరిస్తోందని మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఈ నెల 21న మునుగోడులో సభ పెడతామని మా పార్టీ ప్రకటించింది. అయితే, బిజెపి ప్రకటించాక కేసీఆర్ చెడగొట్టే విధంగా 20వ తేదీన సభ పెడతామని ప్రకటించారు. ఏం అవసరమొచ్చిందని కేసీఆర్ సభ పెడుతున్నారో చెప్పాలన్నారు ఈటల. ఇతర పార్టీల నాయకులకు వెలకట్టడం, ప్రలోభాలకు గురి చేడం టీఆర్ఎస్ చేస్తోందన్నారు. హుజురాబాద్ లో చేసిందే మునుగోడులో పునరావృతం చేస్తున్నారు. ఎన్ని ప్రలోభాలకు గురి చేసిన హుజురాబాద్ ప్రజలు గట్టి దెబ్బకొట్టారు.
కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది.. మునుగోడు ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారు. ఎల్లుండి సాయంత్రం జరిగే అమిత్ షా సభకు మునుగోడు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలి. టీఆర్ఎస్‌లో ఉంటే అవినీతిపరుడు కాదు… బీజేపీలో చేరితే అవినీతిపరుడా? మేము ఏ నాయకులతో సంప్రదింపులు జరిపితే అక్కడికి టీఆర్ఎస్ నాయకులు పోతున్నారు. వందలాది మంది సర్పంచ్, ఎంపీటీసీలు బిజెపి లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. జెడ్పి చైర్మన్లు కూడా బిజెపి లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు ఈటల.
Read Also: Dj Tillu 2: టిల్లు గాని కొత్త గర్ల్ ఫ్రెండ్ ఈమెనట..?
టీఆర్ఎస్ నాయకులు ఇసుక, భూ, బెల్టు షాపులు నడిపితే ఎవ్వరూ పట్టించుకోరా? బీజేపీ నాయకులపై అక్రమంగా కేసులు పెడుతున్నారు. వేల కోట్ల రూపాయలను వాహనదారుల నుంచి దండుకుంటున్నారు. తెలంగాణ సమాజం మొత్తం అసహ్యించుకుంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమని TRS నేతలు చెబుతున్నారు.. కాళేశ్వరం ప్రాజెక్టు అంత అద్భుతమైతే, ఎలాంటి నష్టం జరగకపోతే ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు సందర్శించడానికి వెళ్ళితే ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలన్నారు.
కేసీఆర్ అద్భుత సృష్టి గోదావరి పరివాహక ప్రజలను ముంచింది… మూడో టీఎంసీ కోసం కూడా కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో.. మూడో టీఎంసీ ఎందుకు? డబ్భులు దండుకోవడానికే కేసీఆర్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. డిస్కంలు అప్పుల్లో కూరుకుపోయాయి. జెన్ కో డబ్బులు ఇవ్వకపోవడం వల్ల సింగరేణి దివాళా తీసింది. డిస్కం లకు చెల్లించాల్సిన సొమ్ము ప్రభుత్వం చెల్లిస్తే ఈ పరిస్థితి రాదన్నారు. గోదావరి వరద ముంపుపై చర్చకు మేము సిద్ధం.. TRS సిద్ధమా? అని సవాల్ విసిరారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్.
Read Also: lumpy Skin Disease: లంపీ స్కిన్ వ్యాధిని మహమ్మారిగా ప్రకటించాలి.. సీఎం అశోక్ గెహ్లాట్ డిమాండ్
