Site icon NTV Telugu

Etela Rajender: ‘కేసీఆర్.. అహంకారాన్ని పక్కన పెట్టి ఇంజనీర్ల సూచనలు తీసుకోండి’

Etela Rajender

Etela Rajender

Etela Rajender: కాళేశ్వరం పంప్ హౌజ్‌ల ముంపుకు కేసీఆర్ బాధ్యత వహించాలని భాజపా నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చెప్పారు. కాళేశ్వరం వచ్చి కన్నీళ్లు తెచ్చింది అని రైతులు ఏడుస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నీటిపారుదల శాఖకు మంత్రి లేకపోవడం, సీజన్‌లో అధికారులు విదేశీ పర్యటనకు వెళ్లడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఈటల విమర్శించారు. గోదావరి నుంచి కొండపోచమ్మ వరకు నీటిని ఎత్తిపోస్తే ఎకరాకు రూ.50 వేల రూపాయల కరెంట్ ఖర్చు అవుతుందని చెప్పారు. పండే పంట కంటే కరెంటుకు ఎక్కువ ఖర్చవుతుందని వివరించారు. లిఫ్ట్‌ల ద్వారానే పంటలు పండిస్తాం అంటే చాలా తప్పని వ్యాఖ్యానించారు. తానే ఇంజనీర్ అనే అహంకారాన్ని పక్కన పెట్టి ఇంజనీర్ల సూచనలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సూచించారు. ముంపుకు శాశ్వత పరిష్కారం చూపించాలని ఈటల డిమాండ్ చేశారు.

Madhuyaski Goud: కేసీఆర్ ఇంజినీర్, డాక్టర్, మేధావి..

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న కోట్లు విలువైన పంపుహౌస్‌లు వరదనీటిలో మునిగిపోయినా ఎంతో అనుభవం ఉన్న ఇంజినీర్లు ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావడం లేదన్నారు. సీఎం కేసీఆర్ కూడా గతంలో తానే పెద్ద ఇంజినీర్‌ అని చెప్పారని ఈట గుర్తు చేశారు.ఇంజినీర్లు చెప్పినా సీఎం కేసీఆర్‌ వినకపోవడం వల్లే రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. కాళేశ్వరంలో వేలాది ఎకరాల పంటపొలాలు భూసేకరణతో సంబంధం లేకుండా మునుగుతున్నాయన్నారు. బాధితులు ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం ఉంటుందన్నారు. ప్రజలకు ప్రభుత్వం భరోసా కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ బాధ్యత లేకుండా.. ఇంత పెద్ద ఎత్తున వరదలు వస్తే విదేశాలకు వెళ్లారని ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Exit mobile version