Site icon NTV Telugu

హుజురాబాద్‌ ఎన్నిక కేసీఆర్‌కు కళ్లు తెరిపించింది: డీకె అరుణ


కేసీఆర్‌ ప్రెస్‌ మీట్‌ అనంతరం డీకె అరుణ ప్రెస్‌ మీట్‌పెట్టి మాట్లాడుతూ.. కేసీఆర్‌ పై ధ్వజమెత్తారు. హుజురాబాద్‌ బీజేపీ గెలుపు దుబాయ్‌ శేఖర్‌కు సెగ తగిలించిందన్నారు. హుజురాబాద్‌ ఎన్నికతో కేసీఆర్‌కు కళ్లు తెరిపించాయన్నారు. ఆ రిజల్ట్ చూసి ఆయన దిమ్మ తిరిగిందన్నారు. కేసీఆర్‌ది దొంగ దీక్ష అన్నారు. 12 వందల మందిని చంపి… ఈ రోజు సుద్దపూస లెక్క మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఓటమి గెలుపులు సహజం అని ఇప్పుడు అంటున్నారు.. ఆయనకు ఇప్పుడు జ్ఞానోదయమైనట్టుందన్నారు. హుజూరాబాద్‌లో అన్ని డబ్బు లు ఎందుకు ఖర్చు పెట్టావు. దళిత బంధును ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సిందేనని లేదంటే విడిచి పెట్టమని డీకె అరుణ హెచ్చరిం చారు. నువ్వు బయటకి రావాల్సిందే తెలంగాణకు ఏమి చేశావో చెప్పా ల్సిందేనన్నారు. కేసీఆర్‌ నువ్వు తెలంగాణ ద్రోహివే కాదు.. దేశద్రోహి వి కూడా .. భారతీయుడిగా మాట్లాడినవా సోయిలేదా అంటూ ఆమె కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. సంతోష్ బాబు మరణాన్ని అవమానించే విధంగా మాట్లాడుతున్నావ్‌… ప్రజలు అన్ని గమినిస్తున్నారు… అహంకారాన్ని ఇకనైనా దించుకో అన్నారు.

భారత సైనికుల గురించి మాట్లాడినవ్ అంటే ఎంతకన్న దిగజా రుతావు… పెట్రోల్, డీజిల్ పై ఈయన ధరలు తగ్గించడు కానీ కేంద్రం మాత్రం తగ్గించాలా ? వ్యాట్‌ పెంచలేదని సీఎం అబద్దాలు చెబుతు న్నారన్నారు. మద్యంని వ్యాపారంలా చేశారు. మద్యం ఆదాయం రూ.6 వేల కోట్ల నుంచి 40 వేల కోట్లకు పెరిగింది. సీఎంగా రోల్ మోడల్ గా ఉండాలి… నువ్వు తాగితే తాగు, కానీ తాగిపించి కుటుం బాలను నాశనం చేస్తున్నావన్నారు. కేసీఆర్ డిప్రెషన్లో ఉన్నారు… బూతులు మాట్లాడుతున్నారుకేటీఆర్‌ నీ తండ్రి పై పెట్టు కేసు… తెలంగాణ రాకముందు నీ ఆస్తులు ఎంత..? ఇప్పుడెంతా చెప్పు తెలంగాణ ప్రజలకు అన్ని తెలుసనని ప్రజలు క్షమించరని డీకే అరుణ అన్నారు.

Exit mobile version