అన్నీతానై అత్తింట్లో అడుగుపెట్టిన ఓమహిళకు భర్తవేధింపులకు బలైంది. అనుమానంతో ఎన్ని చిత్రహింసలు పెట్టినా, ఎవరితో మాట్లాడొద్దని ఆంక్షలు విధించినా భరించింది. తన గురించి ఎవరికైనా చెబితే చంపేస్తానని ఓ కీచకుడిలా ప్రవర్తించినా తల్లిదండ్రుల కోసం మౌనంగా వుండిపోయింది. అయినా భరించలేనంతగా భాధలు పెడుతుంటే చివరికి తల్లి దండ్రులతో చెప్పుకుంది. తల్లిదండ్రులు విని సర్దుకుపోమని చెప్పడంతో బాధపడి, తనను కాపాడేవారు ఎవరూ లేరని ఒంటరిగా మిగిలిపోయానని కుంగిపోయింది. చివరకు చావే శర్యణ్యమని ఆత్మహత్యకు పాల్పడింది. తన డైరీలో తన శవాన్ని భర్త, అత్తామామలు తాకొద్దని ఇది తన చివరికోరికగా తల్లితండ్రులు తీర్చాలని రాసుకుని నిండిగర్భిని అనికూడ చూడకుండా తన భర్త చిత్రహింసలకు భరించలేని ఆభార్య చివరకు స్వాస వదిలింది. ఈ ఘటన హైదరాబాద్ లోని బాలాపూర్ లో చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం.. షాహిన్‌నగర్ జుబైద్ కాలనీలో ఉండే దంపతులు ఖాజా మొహియుద్దీన్ అన్సారీ, షబానా బేగం దంపతుల ఐదో కుమార్తె ఫిర్దోస్ అన్సారీ. చార్మినార్ ఫతేదర్వాజాకు చెందిన వ్యాపారి సుల్తాన్ పటేల్ తో గతేడాది ఫిబ్రవరి 1న వివాహమైంది. ముందు సాఫీగానే సాగిన వాల్ల సంసారంలో.. అనుమానం పెనుబూతంలా మారింది. ఎవరితో మాట్లాడినా అనుమానం, బెల్టు, కర్రతో చితకబాదేవాడు. ఆడబిడ్డ భర్త, ఆయన కుమారులతో మాట్లాడినా విచక్షణారహితంగా కొట్టేవాడు. భర్త ప్రవర్తన గురించి.. పుట్టింట్లో లేదా మరెవరికైనా చెబితే రివాల్వార్‌తో కాల్చి చంపుతానని బెదిరించే వాడు. భార్య భర్తల అన్యోన్యంగా గడిపిన దృశ్యాలు అందరికీ చూపిస్తానని హెచ్చరించేవాడు. మృతురాలికి రెండుసార్లు గర్భస్రావమైతే ఆనందపడ్డాడని, ఈ విషయాలన్నీ ఆమె డైరీలో రాసుకుందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం మృతురాలు మూడునెలల గర్భవతి.
అయితే.. తల్లిదండ్రుల వద్ద ఉండాలని హెచ్చరిస్తూ గత నెలలో పంపించేశాడు. ఆగస్టు 1న షాహిన్‌నగర్‌లోని అత్త గారింటికి వచ్చి భార్యను దుర్భాషలాడుతూ చితకబాది వెళ్లిపోయాడు. కాగా.. ఇంతకాలం దాచిన తన భర్త నిజస్వరూపాన్ని పుట్టింటి వారికి వివరించి తనను కాపాడాలని వేడుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. భార్యాభర్తలన్నాక గొడవలుంటాయిలే. మాట్లాడదాం అంటూ వారు నచ్చచెప్పారు. విసిగిపోయిన ఆమె బుధవారం తెల్లవారు జామున తన గదిలో ఫ్యానుకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త వేధింపులకు తాళలేక చనిపోతున్నానని, భర్త, అత్తమామలు, తన మృతదేహాన్ని తాకకుండా అడ్డుకోవాలని కోరింది. అదే తల్లిదండ్రులుగా మీరు నాకు చేసే మేలు అని డైరీలో రాకొచ్చింది. మృతురాలి తల్లి ఫిర్యాదుపై బాలాపూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. భర్త పరారీలో ఉన్నట్లు సమాచారం.