NTV Telugu Site icon

Cruelty husband: అమ్మను నాన్నే చంపాడు.. కన్నతండ్రిపై కూతురు ఫిర్యాదు

Husbend

Husbend

Cruelty husband: కష్టాల్లోనూ, సుఖ సంతోషాల్లోనూ తోడుగా ఉండాల్సిన భర్త , ఆమె పాలిట కాలయముడయ్యాడు. పెండ్లి నాటి ప్రమాణాల్లో ఏడు అడుగులు వేసి కలకాలం తోడుగా ఉంటానని మాట ఇచ్చిన ఆయన.. కుటుంబ కలహాలతో కన్న కూతుళ్ల ఎదుటే భార్యపై శానిటైజర్‌ పోసి నిప్పంటించాడు. కూతుళ్లు వద్దంటున్నా మాట వినకుండా కఠినంగా ప్రవర్తించాడు. దీంతో ఇరవై రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆమె మృతిచెందింది. తల్లి మృతికి తండ్రే కారణమంటూ కూతుళ్లు ఫిర్యాదు చేసిన ఘటన మేడ్చల్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మేడ్చల్‌లోని సూర్యనగర్‌కు చెందిన తిరునగర్‌కు చెందిన నవశ్రీ (33)కి సిద్దిపేట జిల్లా ములుగు మండలం తునికి బొల్లారానికి చెందిన నరేందర్ (35)తో 15 ఏళ్ల కిందటే వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఎంతో సంతోషంగా జీవితాన్ని గడుపుతున్న వీరి కుటుంబంలో గత నెల 18న చిన్న గొడవ జరిగింది. అది కాస్త పెనుగాలిగా మారింది. దీంతో తీవ్ర ఆగ్రహం చెందిన నరేంద్ర తన భార్య నవ్యశ్రీపై శానిటైజర్ పోశాడు. ఆ తర్వాత నిప్పు పెట్టాడు. ఇంతలో చుట్టుపక్కల వారు గమనించి ఆమెకి అంటుకున్న మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అనంతరం కుమార్తెలు ఇరుగుపొరుగు వారి సహాయంతో గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ఆమెకు మెరుగైన చికిత్స అందించారు. గత ఇరవై రోజులుగా ఆమెకు చికిత్స అందించిన వైద్యులు ఆమె ఆరోగ్యం క్షీణించడంతో మరణించినట్లు ప్రకటించారు.

తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు
అయితే నవ్యశ్రీ మృతి చెందడంతో ఆమె పెద్ద కూతురు పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తండ్రి నరేంద్రపై ఫిర్యాదు చేసింది. తన తల్లి ప్రమాదవశాత్తు మంటలు అంటుకోలేదని, తండ్రి ఉద్దేశ్యపూర్వకంగా శానిటైజర్‌ చల్లి నిప్పంటించాడని చెప్పింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్నామని తండ్రికి వద్దని ఎంత చెప్పినా వినలేదని శానిటైజర్‌ను అమ్మపై చల్లి నిప్పుపెట్టాడని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై స్పందించిన పోలీసులు నిందితుడు నరేందర్ పై 302, 201, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Arogya Mahila: రాష్ట్ర మహిళలకు ప్రభుత్వ దీవెన.. నేడు ‘ఆరోగ్య మహిళ’కు శ్రీకారం..

Show comments