Husband Killed His Wife By Throwing Her Into The Canal For Using Phone Regularly In Jagityal District: ఈమధ్య ప్రతి ఒక్కరి జీవితంలో ‘మొబైల్ ఫోన్’ అనేది అనివార్యమైపోయింది. చాలామంది తమ కుటుంబ సభ్యుల కన్నా, ఫోన్‌తోనే ఎక్కువసేపు గడుపుతున్నారంటే.. ఏ స్థాయిలో దానికి అందరూ అడిక్ట్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు. తిండి లేకపోయినా బ్రతకగలమేమో గానీ, ఫోన్ లేకపోతే మాత్రం ఉండలేమన్న పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయి. అఫ్‌కోర్స్.. ఈ మొబైల్ ఫోన్ వల్ల చాలామంది అవసరాలైతే తీరుతున్నాయి కానీ, చాలామంది కేవలం కాలక్షేపం కోసమే దీనిని వినియోగిస్తున్నారు. ఇక్కడే అసలు సమస్య వచ్చిపడింది. మితిమీరి వాడుతున్న వారి జీవితాల్లో.. ఈ మొబైల్ ఫోన్ చిచ్చు పెడుతోంది. పచ్చని కాపురాల్లో చిచ్చు కూడా పెడుతోంది. ఇప్పుడు తాజాగా ఓ కాపురం కూడా ఈ ఫోన్ వల్లే కూలిపోయింది. తన భార్య ఫోన్ వాడటాన్ని సహించలేకపోయిన భర్త.. ఆమెని వరద కాల్వలో పడేసి హత్య చేశాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Etela Rajender: మా మధ్య ఎలాంటి గ్యాపులు లేవు.. ఈటల క్లారిటీ
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలానికి చెందిన జామీర్‌తో పది నెలల క్రితం కోరుట్లకు చెందిన సాజిదతో వివాహం అయ్యింది. వీరి సంసార జీవితం మొదట్లో సాఫీగానే సాగింది. కొన్నాళ్లు ఎలాంటి గొడవలు లేకుండా.. అన్యోన్యంగా తమ దాంపత్య జీవితాన్ని గడిపారు. అయితే.. కొన్ని నెలల గడిచాక జామీర్, సాజిదల మధ్య విభేదాలు తలెత్తాయి. ఇందుకు కారణం.. సాజిద తరచూ ఫోన్‌లో మాట్లాడటమే! గంటలు గంటలు ఫోన్‌లో మాట్లాడుతుండటంతో.. భార్యపై జామీర్ అనుమానం పెంచుకున్నాడు. తాను తన బంధవులతోనే ఫోన్‌లో మాట్లాడుతానని చెప్పినా.. జామీర్ అనుమానం తీరలేదు. దీంతో.. అతడు తన భార్యను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. భూషణ్‌రావు పేట్ వరద కాల్వ వద్దకు తన భార్యను మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు. కాలువ దగ్గరికి వెళ్లిన వెంటనే.. సాజిదని తోసేసి, హత్య చేశాడు. ఈ విషయం తెలుసుకున్న సాజిద కుటుంబ సభ్యులు.. జామీర్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Tamannah : ఆ కారణం వలనే విజయ్ వర్మను ప్రేమించాను..