Site icon NTV Telugu

పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నా : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, బండి సంజయ్ కుమార్


ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తే కార్యకర్తల కాళ్లు విరిగేలా దాడులకు పాల్పడతారా అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. కిసాన్ మోర్చా నాయకులపై పోలీసుల దౌర్జన్యాన్ని ఆయన ఖండించారు. పోలీసుల దాడిలోకార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయ న్నారు. ఒక నాయకుడికి కాలు విరిగిందని, ఇంకో నాయకుడి మెడపై తీవ్రగాయమైనట్టు ఆయన తెలిపారు. గాయపడ్డ కార్యకర్తలను తక్షణమే ఆసుపత్రికి తరలించాలని ఆయన అన్నారు.

వందలాది మంది కార్యకర్తలను అరెస్టు చేశారని వారు ఏం పాపం చేశారని బండి సంజయ్ అన్నారు. అరెస్టు చేసిన కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఖరి పై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రశ్నించే వారిని అరెస్టులు, కేసులతో ఇబ్బందులు పెట్టాడానికే ప్రజలు అధికారం కల్పించారా అని బండి సంజయ్‌ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేసీఆర్‌కు ప్రజలు తప్పక బుద్ధి చెబుతారన్నారు. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ పాలనపై ప్రజలు విసుగు చెందరాని ఆయన అన్నారు.

Exit mobile version