Site icon NTV Telugu

Hyderabad Rains: హైదరాబాద్లో కుండపోత వర్షం.. బయటకు రావొద్దని హెచ్చరికలు!

Hyderabad Rains Alert

Hyderabad Rains Alert

Huge rain at hyderabad: ఋతుపవనాల ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. తాజాగా తెలంగాణ రాజధాని హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. మొదలైంది. హైదరాబాద్ వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తుండటంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ముఖ్యంగా మణికొండ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మియాపూర్, యూసుఫ్ గూడ, అమీర్పేట్, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, దిల్సుఖ్నగర్, చైతన్యపురి, ఎల్బీనగర్, నాగోల్, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతున్న క్రమంలో అక్కడి రోడ్లు అన్నీ కాలువలను తలపిస్తున్నాయి. ఇక. మిగతా ప్రాంతాల్లోనూ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక హైదరాబాద్ లో భారీ వర్షం నేపధ్యంలో డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి.

Personal Loan: పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా?.. ఈ టిప్స్ మీ కోసమే..

ఇక నీరు నిలవడంతో పాటు వర్షానికి వాహనాల కదలిక నెమ్మదిగా ఉండడంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. ఇక ఈ క్రమంలో వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో అరగంట నుంచి గంట వరకు వర్షం కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అంతేకాదు హైదరాబాద్‌కు మరో 24 గంటలపాటు ఉరుములతో కూడిన భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అవసరమైతే తప్ప బయటికి రావొద్దని GHMC నగర పౌరులను హెచ్చరించింది, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉంచాలంటూ అధికారులను ఆదేశించింది. రుతుపవనాల ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. .

Exit mobile version