Hyderabad Rains: హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. బయటకు రావొద్దని హెచ్చరికలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Huge rain at hyderabad: ఋతుపవనాల ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. తాజాగా తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. మొదలైంది. హైదరాబాద్ వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తుండటంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ముఖ్యంగా మణికొండ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మియాపూర్, యూసుఫ్ గూడ, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, దిల్సుఖ్నగర్, చైతన్యపురి, ఎల్బీనగర్, నాగోల్, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతున్న క్రమంలో అక్కడి రోడ్లు అన్నీ కాలువలను తలపిస్తున్నాయి. ఇక. మిగతా ప్రాంతాల్లోనూ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక హైదరాబాద్ లో భారీ వర్షం నేపధ్యంలో డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి.
Personal Loan: పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా?.. ఈ టిప్స్ మీ కోసమే..
Also Read
- Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్‌లో ఒకే రోజు ముగ్గురు బలి!
- OTR : తెలంగాణ MLC ఎన్నికల్లో కాంగ్రెస్ కొత్త లెక్కలు..! రెండు సీట్లు రెడ్లకేనా..?
- Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్లకు మరో ఛాన్స్.. ఆగస్టు 15 వరకు గడువు.!
ఇక నీరు నిలవడంతో పాటు వర్షానికి వాహనాల కదలిక నెమ్మదిగా ఉండడంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. ఇక ఈ క్రమంలో వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో అరగంట నుంచి గంట వరకు వర్షం కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అంతేకాదు హైదరాబాద్‌కు మరో 24 గంటలపాటు ఉరుములతో కూడిన భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అవసరమైతే తప్ప బయటికి రావొద్దని GHMC నగర పౌరులను హెచ్చరించింది, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉంచాలంటూ అధికారులను ఆదేశించింది. రుతుపవనాల ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. .
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!