Site icon NTV Telugu

Harish rao: ప్రభుత్వ ఉద్యోగికి ధీటుగా రైతుకు డిమాండ్ పెరిగింది.

185745 Harish Rao 1280x720

185745 Harish Rao 1280x720

తెలంగాణ పంటలపై కీలక కామెంట్లు చేశారు మంత్రి హరీష్ రావు. ఇదే విధంగ మోటర్లకు మీటర్లు పెట్టాలనుకున్న కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. 5 ఏళ్లలో అత్యధికి పంటలు పండించే విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని అన్నారు. ఉమ్మడి ఏపీలో ఆకలి చావులు, కాలిపోయే మోటార్లు, గుక్కెడు నీళ్లు లేకుపోయేవని ఆయన అన్నారు. అలాంటిది ఇప్పుడు తెలంగాణలో 24 గంటల కరెంట్, పుష్కలమైన నీళ్లు ఇస్తున్నామని తెలిపారు. రైతు బీమా పథకంల దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వడం లేదని.. రైతు బీమా ద్వారా అత్యధిక రైతు ఆత్మహత్యలు నిలిపివేసిన ప్రభుత్వం.. తెలంగాణ ప్రభుత్వమే అని హరీష్ రావు అన్నారు.

వ్యవసాయ బోర్ల వద్ద మీటర్లు పెట్టాలని కేంద్రం ప్రయత్నించిందని విమర్శించారు. బోర్ల కాడ మీటర్లు పెడితే కేంద్రం నిధులు ఇస్త్తామని కేందరం అంటే.. నిధులు ఇవ్వకున్నా సరే కానీ మీటర్లను మాత్రం పెట్టము అని చెప్పిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ఆయిల్ పామ్ పంటకు చాలా లాభాలు ఉన్నాయని.. డ్రిప్, మొక్కలకు సబ్సిడీలు ఇస్తున్నామని ఆయన అన్నారు. ప్రతీ నెల జీతం లాగా ఆయిల్ పామ్ డబ్బులు రైతుల ఖాతాల్లో పడతాయని అన్నారు. పత్తికి ప్రస్తుతం గిట్లుబాటు ధర ఉందని.. రైతులు పత్తి పంట సాగు చేయాలని సూచించారు. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగానికి డిమాండ్ ఉండేదని.. ఇప్పుడు వాటికి ధీటుగా వ్యవసాయం చేసే రైతులకు డిమాండ్ ఏర్పడిందని హరీష్ రావు అన్నారు.

Exit mobile version