Telangana Elections: దీపం ఉన్నపుడే ఇల్లు సద్దుకోవాలి అమ్మగారు. నెలంతా కష్టపడితే గాని రాని పైసలు కేవలం ఉదయం రెండు గంటలు, సాయంత్రం రెండు గంటలు అలా వెళ్లి ఇలా వస్తే వస్తున్నాయి. కూసంత సర్దుకోండి అయ్యగారు. అని పనులకు సక్రమంగా రాని పనిమనుషులు. పని మనిషి రాక, పని చేసుకోవడం చేతగాక యజమానులు పరేషాన్ అవుతున్నారు. ఇలా ఎక్కడో కాదు తెలంగాణ లోనే జరుగుతుంది. వివరాలలోకి వెళ్తే.. తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. పార్టీ నేతలు హుషారుగా నిద్రాహారాలు లేకుండా పరచారంలో మునిగి పోయారు. ఈ నేపథ్యంలో చిన్న పార్టీల నుండి ప్రధాన పార్టీల వరకు అన్ని పార్టీలు వాళ్ళ వాళ్ళ పార్టీల గురించి ప్రచారం చేస్తున్నాయి. దీనితో పార్టీ ప్రచారానికి కార్యకర్తల కొరత ఏర్పడింది.
Read also:Vanitha Vijay Kumar: బిగ్ బాస్ కాంట్రవర్సీ… అర్ధరాత్రి నటిపై దాడి
ఈ నేపథ్యంలో జెండాలు మోయడానికి, ఇళ్ల తలుపులపై పార్టీ స్టిక్కర్లు అంటించడానికి, ప్రహరీలకు జెండాలు కట్టడానికి బహుళ అంతస్తులు, గేటెడ్ కమ్యూనిటీలలో పని చేసే పనిమనుషులను, వాచ్‌మన్ లను బాడుగకు తీసుకుంటున్నారు. దీనితో ఏ పార్టీ ని చూసిన ముందు వరుసలో పార్టీ అభ్యర్థి బంధువులు, కీలక అనుచరులు ఉంటారు. ఇక వాళ్ళ వెనక జెడాలు మోసే కార్యకర్తలు అందరూ కిరాయికి వచ్చినవాళ్లే. ఉదయం 2 గంటలు సాయంతం 2 గంటలు ప్రచారానికి వెళ్తే రూ/ 600 నగదు, ఓ బిర్యాని ప్యాకెట్, ఓ కూల్ డ్రింక్ బాటిల్. కాగా రోజు మొత్తం ప్రచారం చేస్తే రూ/1000 నగదు, కోడి కూర భోజనం, కూల్డ్రింక్. దీనితో పనిమనుషులు పనులను మానుకుని ప్రచారాలకు వెళ్తున్నారు. వాళ్ళు పని చేస్తున్న యజమానులను ఈ నాలుగు రోజులు ఎలాగోలాగా సర్దుకోవాల్సిందిగా కొందరు బతిమిలాడుతున్నారు.
