Site icon NTV Telugu

Devarakadra hot politics: దేవరకద్రలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ

Trs Vs Bjp

Trs Vs Bjp

తెలంగాణలో 2023లో రాబోయే ఎన్నికలకు ముందే హాట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. జిల్లాల్లో బీజేపీ దూకుడు పెంచుతోంది. దేవరకద్ర రాజకీయం వేడెక్కుతోంది. అక్కడ కమలం, గులాబీ మధ్య మాటల మంటలు రాజుకుంటున్నాయి. బిజెపి చేపట్టిన ప్రజాగోస- బిజెపి భరోసా బైక్ ర్యాలీ ల కార్యక్రమంతో టిఆర్ఎస్ టార్గెట్ గా విమర్శలు గుప్పించడం …. అందుకు బదులుగా టిఆర్ఎస్ నేతలు గట్టి కౌంటర్ ఇస్తుండటం తో అసెంబ్లీ సెగ్మెంట్ రాజకీయం హీటు పుట్టిస్తోంది .

పాలమూరు జిల్లాలోని దేవరకద్ర నియోజక వర్గంలో అధికార టిఆర్ఎస్ , బిజెపి ల మధ్య మాటల యుద్దం సాగుతోంది. నువ్వు ఒకటంటే నేను రెండంట అన్నట్లు టీఆర్ఎస్ , బిజెపి నేతల మద్య మాటల తూటాలు పేలుతున్నాయి . మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర నియోజక వర్గంలో ప్రజా గోస – బీజెపి భరోసా పేరుతో బైక్ ర్యాలీలను చేపట్టింది. వారం రోజుల పాటు నియోజక వర్గంలో సాగే బైక్ ర్యాలీలకు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు , హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఇన్‌ ఛార్జిగా ఉన్నారు. నియోజక వర్గమంతా బైక్ ర్యాలీ తో చుట్టేస్తూ సమయం సందర్భం దొరికిన వెంటనే టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలతో పాటు , కేసిఆర్, టిఆర్ఎస్ టార్గెట్ గా విమర్శల వర్షం కురిపిస్తున్నారు ఈటెల.

కొత్త ఫించన్లు , డబల్ బెడ్రూం ఇళ్ళు దీంతో పాటు నియోజక వర్గంలో ఎమ్మెల్యే వైఫల్యాలతో పాటు హమీకి నోచుకోని అంశాలను తెరపైకి తెస్తున్నారు. పాలమూరు జిల్లాలోని పద్నాలుగుకు పద్నాలుగు బిజెపి గెలుస్తోందని చెప్పుకొస్తూ పార్టి శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు ఈటెల. ఈటెల తో పాటు నియోజక వర్గ నేతలు డోకూరు పవన్ కుమార్ రెడ్డి , ఎగ్గని నరసింహులు ఉన్నారు. దీనిపై అధికార టిఆర్ఎస్ పార్టి నేతలు కూడా గట్టిగానే స్పందిస్తున్నారు. ఈటెల విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తుండటంతో ముసురు వర్షంలో కూడా దేవర కద్ర పాలిటిక్స్ హీట్ పుట్టిస్తున్నాయి . ముఖ్యంగా తమ అధినేత కేసిఆర్ ను మాటంటే ఊరుకునేది లేదన్నట్లు టిఆర్ఎస్ శ్రేణులు స్పందిస్తున్నాయి . అసలు టిఆర్ఎస్ పార్టి లేకుంటే ఈటెల ఉండే వారా … అంటూ ప్రశ్నిస్తున్నాయి .

హుజురాబాద్ లో గెలిచే పరిస్థితి లేదు కాబట్టే ముఖ్యమంత్రి కేసిఆర్ పై పోటీ అంటూ కొత్త మాటను తెరపైకి తెస్తున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి . పాలమూరులో ఒక్కటంటూ ఒక్క సీటు కూడా బిజెపి గెలిచే పరిస్థితి లేదంటూ …. అసలు ప్రజలకు గోస బిజెపి తోనే అంటూ సెటైర్లు వేస్తున్నారు అధికార పార్టి ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి . మరో పక్క నియోజక వర్గంలో జరిగిన అభివృద్ది , పల్లెల్లో అందిన సంక్షేమ పథకాలను గమనించి హుందాగా కార్యక్రమం చేసుకోవాలే తప్ప …. స్థానిక లీడర్లిచ్చే చిట్టీలు చూసి విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు ఎమ్మెల్యే.

ఇదిలా ఉంటే వారం రోజుల పాటు నియోజక వర్గంలో పర్యటించే బీజేపీ నేత ఈటెల , గ్రామాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించడం తో పాటు , ఆయా వర్గాల ప్రజలతో ఇంటరాక్ట్ కానున్నారు. ఇదే క్రమంలో ఆయన కేసిఆర్ , టిఆర్ఎస్ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తే సహించేది లేదంటున్నారు నియోజక వర్గంలో ని టిఆర్ఎస్ శ్రేణులు. ప్రజాస్వామ్య యుతంగా మీరేం చేసారో , ఏం చేస్తారో చెప్పుకోండి అంతే కాని , మా అధినేతను టార్గెట్ గా చేసుకోని మాట్లాడితే ఊరుకునేది లేదంటూ తేల్చి చెబుతున్నారు. మొత్తం మీద ప్రశాంతంగా , ఎక్కడా రాజకీయ హడావిడి లేని దేవరకద్ర నియోజక వర్గంలో బిజెపి చేపట్టిన ప్రజాగోస – బిజెపి భరోసా బైక్ ర్యాలీలతో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కినట్లయింది.

Virat Kohli: ఫామ్‌లో లేకపోయినా అగ్రస్థానంలోనే విరాట్ కోహ్లీ..!!

Exit mobile version