Site icon NTV Telugu

బ్రేకింగ్‌: తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులు పొడిగింపు

కరోనా పాజిటివ్‌ కేసులు క్రమంగా పెరుగుతోన్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది… విద్యా సంస్థలకు సెలవులు పొడిగించాలని నిర్ణయానికి వచ్చింది.. రాష్ట్రంలో సంక్రాంతి సెలవులు ఇవాళ్టితో ముగియనుండగా.. రేపటి నుంచి స్కూళ్లు, విద్యాసంస్థలు ప్రారంభం కావాల్సి ఉంది.. అయితే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో మరికొద్ది రోజులు సెలవులు పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.. వాటిని నిజం చేస్తూ.. ఈ నెల 30వ తేదీ వరకు విద్యా సంస్థల సెలవులను పొడిగిస్తున్నట్టు ప్రకటించింది ప్రభుత్వం.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్…

Read Also: హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో భారీ వర్షం.. ఎక్కడ ఎంత అంటే..?

తెలంగాణలో కరోనా ఆంక్షలను ఈ నెల 20వ తేదీకి వరకు పొడిగించిన నేపథ్యంలో.. విద్యా సంస్థలకు సెలవులు కూడా పొడిగించాలని రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి సూచించగా… దీంతో.. ఈ నెల 30వ తేదీ వరకు సెలవులు ప్రకటిస్తున్నట్టు సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ తెలిపారు. వైద్య, ఆరోగ్యశాఖ సూచనలపై సీఎం కేసీఆర్‌తో చర్చించిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చారు సీఎస్.. అయితే, సెలవులను 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు స్పష్టం చేశారు సీఎస్‌.. దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలు మొత్తం.. 30వ తేదీ వరకు మూతపడనున్నాయి.. ఈ సమయంలో ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తారా? లేదా..? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

Exit mobile version