Shiva Balakrishna: హెచ్ఎండిఎ మాజీ కార్యదర్శి శివ బాలకృష్ణ కేసులో ఆస్తులు అక్రమాలు తవ్వినా కొద్ది బయటకు వస్తున్నాయి. శివబాలకృష్ణ సోదరుడు శివనవీన్ దంపతులు, భరత్ పేర్లతో పాటు మరి కొంత మంది కుటుంబ సభ్యులు పేరిట భూములు, ఫ్లాట్లు ఉన్నట్లు గమనించారు పోలీసులు. శివబాలకృష్ణ ఇంట్లో దొరికిన ల్యాండ్ డాక్యుమెంట్లు శివనవీన్ పేరు మీదే ఉన్నట్లు గ్రహించారు. ఈ డాక్యుమెంట్లు పై నవీన్ సరైన సమాధానాలు చెప్పలేదు. దీంతో ఏసీబీ శివబాలకృష్ణ సోదరుడు శివ నవీన్ ను అరెస్టు చేసారు. శివబాలకృష్ణకు శివనవీన్ బినామీగా ఉన్నట్లు గుర్తించారు. శివనవీన్‌ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఇప్పటికే శివబాలకృష్ణ భార్య బంధువు నవీన్ వద్ద పలు ఆస్థి పేపర్లు స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల పాటు హెచ్ఎండీఏ కార్యాలయంలో ఏసీబి సోదాలు నిర్వహించారు. ఈరోజుతో శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీ ముగియనుంది. శివబాలకృష్ణ కస్టడిని పొడిగించాలని ఏసీబి అధికారులు కోర్టును కోరనున్నట్లు సమాచారం.
Read also: Kenya : 191మంది పిల్లలను ఆకలితో చంపి.. అడవుల్లో పూడ్చిపెట్టిన నీచుడు
నిందితులను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని గతంలో ఏసీబీ అధికారులు కోరగా.. 8 రోజుల పాటు కోర్టు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. గత ఆరు రోజుల విచారణలో అతని ఆస్తులపై ఆరా తీసినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం హెచ్‌ఎండీఏ, రెరా ఉద్యోగులను పిలిపించి విచారించినట్లు తెలుస్తోంది. నిందితుడితో పనిచేసిన ఉద్యోగులకు నోటీసులిచ్చి విచారించామని అధికారులు తెలిపారు. శివబాలకృష్ణ కంటే ముందే రెరాలో కీలక స్థానాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను విచారించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. శివబాలకృష్ణ అనుమతులు ఇచ్చిన రియల్ ఎస్టేట్ వెంచర్లపై ఆరా తీసినట్లు వెల్లడించారు. వీటితో పాటు కోర్టు వివాదాల్లో ఉన్న భూములకు కూడా నిందితులు అనుమతులు ఇచ్చినట్లు తెలిసిందని అధికారులు తెలిపారు. మాన్యువల్ పర్మిషన్లు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందనే దానిపై ఆరా తీసినట్లు వెల్లడించారు. గత నెల 24న శివబాలకృష్ణ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ రోజే రూ.100 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. రూ.40 లక్షల నగదు, రెండు కిలోల బంగారు ఆభరణాలు, ఆస్తి పత్రాలు, బ్యాంకు డిపాజిట్లు, 60 ఖరీదైన చేతి గడియారాలు, ఇతర వస్తువులను అధికారులు గుర్తించారు. దీంతో ఏసీబీ కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం అధికారులు శివ బాలకృష్ణని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Cm Kejriwal: ఈడీ నోటీసులపై స్పందించని ఢిల్లీ సీఎం.. కోర్టుకు అధికారులు..