Hijras Created Havoc: బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో హిజ్రాల గ్రూపు వీరంగం సృష్టించింది. ఏరియాలుగా పంచుకుని వసూళ్లపై హిజ్రాల గ్రూపుల మధ్య వాదోపవాదాలు చెలరేగడంతో.. అదికాస్త చిలి చిలికి గాలివానైంది. దీంతో హిజ్రాల గ్రూపులు పోలీస్ స్టేషన్ కు చేరారు. నకిలీ, ఒరిజినల్ హిజ్రాలు అంటూ గొడవలకు దిగారు. రౌడీలను మెయింటైన్ చేస్తూ దాడులకు పాల్పదుతున్నారు అంటూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. తమను రౌడీలతో వేధిస్తున్న హిజ్రా నాయకురాలు మోనాలిసా మీద చర్యలు తీసుకోవాలని అంటూ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో రెండో గ్రూపుకు చెందిన హిజ్రాల ఆందోళన చేపట్టారు. దీంతో ఒక హిజ్రాల గ్రూపులో ఒకరు పోలిస్ స్టేషన్ లో హంగామా సృష్టించి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇరువురిని శాంతింప జేసేందుకు ప్రత్నించినా ఫలితం లేకుండా పోయింది. హిజ్రాల గ్రూపులు ఒకరిపై మరొకరు పరస్పర ఆరోపణలు చేశారు.
Read also: Indonesia: ఇండోనేషియాలో విపత్తు.. నేటితో ప్రకృతి బీభత్సానికి 18 ఏళ్లు..
దీంతో పోలీస్టేషన్ లో హిజ్రాల అరుపులతో హోరెత్తింది. మోనాలిసా మీద ఫిర్యాదు చేసి తనను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మేము నకిలీ కాదు ఒరిజినల్ హిజ్రాలమంటూ చెలరేగిపోయారు. దీంతో పోలీస్టేషన్ లో హిజ్రాలు హంగామా సృష్టించడంతోటు పోలీసుల విధులు అడ్డగించిన హిజ్రాల మీద కింద ipc 353, 306 red with 511 కింద కేసు నమోదు చేశారు. అయితే నగరంలోని పలు ప్రాంతాల్లో ఇదే పరిస్తితి ఉండడంతో కఠిన చర్యలకి పోలీసు ఉన్నతాధికారుల కసరత్తు చేపట్టారు. హిజ్రాలు ఎక్కడపడితే అక్కడ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని, దీని వల్ల ఒరిజన్ హిజ్రాలపై ప్రజలు అసహించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు నకిలీ హిజ్రాల వేశధారణ వేసి ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు కోరారు.
Kerala: పొరపాటున యువకుల అకౌంట్లలోకి రూ. 2 కోట్లు.. ఇక ఆ తర్వాత చూసుకో..