Hydra Team: మూసీ నివాసితుల ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మూసీ ప్రక్షాళనలో రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. మూసీ వద్ద ఆక్రమణలు తొలగించిన వెంటనే సుందరీకరణ పనులపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా మూసీ నిర్వాసితుల గుర్తింపు కోసం సర్వే కొనసాగుతోంది. పునరావాసం కోసం అధికారులు పేదల వివరాలను సేకరించడం ప్రారంభించారు. పునరావాసం తర్వాతే ఇళ్లను కూల్చివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులైన కుటుంబాలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. మూసీ నది ఆక్రమణల నుంచి బయటపడేందుకు సర్కార్ చర్యలు చేపట్టింది. మూసి నదిలో 2,166 ఇళ్లను అధికారులు గుర్తించారు. అయితే హైదరాబాద్ జిల్లా పరిధిలోనే ఎక్కువ ఆక్రమణలను అధికారులు గుర్తించారు. మూసీ రివర్ బెడ్ ప్రాంతాలను గుర్తించి మార్కింగ్ వేస్తున్న సిబ్బంది..చాదర్ ఘాట్, మూసా నగర్, శంకర్ నగర్ లలో హిమయత్ నగర్ తహశీల్దార్ సంధ్యా రాణి ఆధ్వర్యంలో సర్వే కొనసాగుతుంది.. అయా నిర్మాణాల్లో నివసించేది యజమానా లేక కిరాయిదారా అని ఎంక్వయిరీ అధికారులు చేపట్టారు.
Read also: Rajanna Siricilla: పాత వారికే రేషన్ డీలర్లు కేటాయించాలి.. పెట్రోల్ బాటిల్ తో నిరసన..
కిరాయి దారైతే ఎంత అద్దె చెల్లిస్తున్నారు? ఆధార్ కార్డు ఉందా? వయస్సు ఎంత? నీ వివరాలు సేకరిస్తున్న అధికారులు. నివసించేది యజమాని అయితే కరెంట్ బిల్లు వస్తున్నదా? ఇంటి పేపర్లు ఏమైనా ఉన్నాయా?” వంటి ప్రాథమిక వివరాలు తెలుసుకుంటున్నారు. ఇక హైదరాబాద్ పాతబస్తీ బహదూర్పురా నియోజకవర్గంలో మూసి నది రివర్ బెడ్ లో ఉన్న ఇండ్ల వివరాలు తీసుకొని రెవెన్యూ అధికారులు మార్కింగ్ చేస్తున్నారు. హైదరాబాద్ పాతబస్తీ కిషన్ బాగ్, అసద్ బాబ నగర్, నందిముసలై గూడ ప్రాంతాలలో రెవెన్యూ అధికారులు 5 టీంలుగా ఏర్పడి పోలీసుల సహాయంతో సర్వే చేస్తూ మార్కింగ్ చేస్తున్నారు. దాదాపు 386 ఇండ్లు మూసి రివర్ బేడీలోకి వస్తున్నాయని తెలిపారు. రివర్ బెడ్ లో వచ్చే అన్ని ఇండ్లలో ఉంటున్న వారి వివరాలు బహదూర్పురా మండలం రెవెన్యూ అధికారులు సేకరిస్తూ మార్కింగ్ చేస్తున్నారు. మొత్తం బహదూర్పురా నియోజకవర్గంలో దాదాపు 386 ఇండ్ల వివరాలు సేకరిస్తున్నారు. బహదూర్పురా తహసీల్దార్ చంద్రశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో 5 టీంలు సర్వే చేస్తున్నాయి. మరో 4 గురు తహశీల్దార్లు ఈ సర్వేలో ఉన్నారు. బహదూర్పురా పోలీసులు ఎలాంటి అవంచనియా ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.
Tension in Dubbaka: దుబ్బాకలో రచ్చ రచ్చ.. మూడు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట