NTV Telugu Site icon

TG High Court: చార్మినార్ కూల్చమంటే కూల్చేస్తారా? రంగనాథ్ పై హైకోర్టు సీరియస్

Hydera

Hydera

TG High Court: చార్మినార్‌ని కూల్చివేయమని ఎమ్మ్యేర్వో చెబితే మీరు కోల్చేస్తారా? అంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా కూల్చివేతపై యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. బాధితుల పిటిషన్‌ను ధర్మాసనం ఇవాళ విచారించింది. హైడ్రా కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోర్టుకు హాజరయ్యారు. వాస్తవంగా హైకోర్టుకు వర్చువల్‌ గా హాజరై వివరణ ఇచ్చారు. అయితే కూల్చివేతలపై రంగనాథ్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారమే కూల్చివేతలు ఎందుకు చేశారని సూటిగా ప్రశ్నించింది. పత్రికలు చెప్పినట్లు వింటారా లేక చట్టాన్ని పాటిస్తున్నారా అని హైకోర్టు ప్రశ్నించారు. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు ఎలా చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించింది.. హైడ్రాకు చట్టబద్ధత ఏంటో చెప్పాలని కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

మీరు చట్టాన్ని ఉల్లంఘించి కూల్చివేతలు చేస్తున్నారు’ అని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మార్వో ఆదేశాలు మేరకే కూల్చామన్న కమీషనర్‌ రంగనాథ్‌ మాటలకు హైకోర్టు సీరియస్‌ అయ్యింది. అయితే చార్మినార్‌ని కూల్చివేయమని ఎమ్మ్యేర్వో చెబితే మీరు కోల్చేస్తారా.. నేనడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పండి… జంప్ చేయకండి. అమీన్ పూర్ గురించి మాత్రమే మాట్లాడండి.. అంతేకానీ.. కావూరి హిల్స్ గురించి నేను అడగలేదు ’’ అంటూ హైడ్రా కమిషనర్‌ కు హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. అయితే.. కోర్టు పరిధిలోని భవనాలను హైడ్రా కూల్చివేయడంపై గత విచారణలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కోర్టుకు హాజరుకావాలని హైడ్రా కమిషనర్‌కు కోర్టు నోటీసులు జారీ చేయడంతో రంగనాథ్ ఈరోజు వర్చువల్‌ ద్వారా విచారణకు హాజరయ్యారు.
Kanpur Test: భారత్-బంగ్లాదేశ్‌ రెండో టెస్టు.. నాలుగో రోజు ఆటలో మార్పులు!