NTV Telugu Site icon

Shamshabad: శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీ బందోబస్తు..

Shamshabad Airport

Shamshabad Airport

Shamshabad: శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. రెండు రోజుల పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరగనున్న నేపథ్యంలో సోయాంక, రాహుల్, సోనియా హైదరాబాద్ రానున్నారు. కాగా.. ఎయిర్ పోర్ట్ వద్ద భారీ భద్రతను పెంచారు. ఎయిర్‌ పోర్టు వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. ఎయిర్ పోర్ట్ నుండి సిడబ్ల్యుసి సమావేశం జరిగే ప్రాంతం వరకు వాహనాలతో అధికారులు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. వాహనశ్రేణిలో మొత్తం 30కి పైగా వాహనాలు పాల్గొననున్నారు. మరికొద్ది సేపట్లో భద్రతా సిబ్బంది ట్రయల్ రన్ ను ప్రారంభించనున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ట్రాఫిక్‌ ను మార్చారు. ప్రయాణికులకు వేరే మార్గం ద్వారా వెళ్లాలని సూచించారు. ట్రాఫిక్‌ రూల్స్‌ సాయంత్రం వరకు ఉంటాయని తెలిపారు. ప్రజలకు సహకరించాలని సూచించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని సూచనలు జారీ చేశారు.

Read also: Thummala Resigns: రాజీనామా చేసిన తుమ్మల.. టీఆర్ఎస్‌లో సహకరించినందుకు ధన్యవాదాలు..

కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షుడైన తర్వాత తొలిసారిగా ఆయన అధ్యక్షతన హైదరాబాద్‌లో ఇవాళ, రేపు (16-17) రెండు రోజుల పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరగనుంది. ఈ భేటీలో తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై చర్చించి, అందుకు సంబంధించిన వ్యూహాన్ని కూడా రూపొందించనున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో పార్టీ విజయోత్సవ ర్యాలీ చేపట్టి, తెలంగాణకు ఐదు హామీలను కూడా ప్రకటించబోతోంది. మల్లికార్జున్ ఖర్గే గత నెలలోనే కొత్త కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ప్రకటించారు. ఈరోజు జరిగే ఈ సమావేశానికి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా హాజరుకానున్నారు. అదే సమయంలో రెండు రోజుల పాటు జరిగే ఈ సభకు దేశం నలుమూలల నుంచి చిన్నా, పెద్ద కాంగ్రెస్ నేతలు తరలిరావడం ప్రారంభించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలు, ఇందుకోసం ఏర్పాటైన మహాకూటమి ఇండియాపై కూడా ఈ సమావేశంలో పలు అంశాలు చర్చకు రానున్నాయి.
MLC Kavitha: రాజకీయ టూరిస్టులకు స్వాగతం.. హైదరాబాద్‌ బిర్యానీ తిని వెళ్లండి