NTV Telugu Site icon

Heavy rains: హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన

Raee;

Raee;

తెలంగాణలో రుతుపవనాలు విస్తరించడంతో హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌లోని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జూన్ 27న హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని తెలిపింది. ఆకాశం మేఘావృతమై ఉంటుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఇది కూడా చదవండి: Upcoming CNG Cars: త్వరలో ఇండియా మార్కెట్లో విడుదల కానున్న సీఎన్జీ కార్లు ఇవే..!

చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్‌బీ నగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాల్లో రానున్న ఐదు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉందని తెలిపింది.

ఇది కూడా చదవండి: US flight: ప్రయాణికురాలికి చేదు అనుభవం.. థ్యాంక్యూ సార్ అన్నందుకు సిబ్బంది ఝలక్

Show comments