Site icon NTV Telugu

Rain Forecast: రాష్ట్రంలో దంచికొడుతున్న వానలు.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు

Telangana Rains

Telangana Rains

Rain Forecast: తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నేడు, రేపు రాష్ట్రంలోని పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ మేరకు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు సోమవారం రాత్రి వాతావరణ బులెటిన్‌ విడుదల చేశారు. నేడు, రేపు పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్‌ ప్రకటించారు. ఈరోజు ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.

Read also: Aviation Industry: పెరుగుతున్న ప్రయాణికులు.. మూతపడుతున్న విమాన సంస్థలు

రేపు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, నిర్మల్, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో కొన్నిచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే 29 నుంచి జూలై 1వ తేదీ వరకు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని, వర్షం పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల లోపు నమోదవుతుండగా, అన్ని జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల లోపు నమోదవుతున్నాయి. నిన్న హైదరాబాద్‌లో గరిష్టం 30.8, కనిష్టంగా 24.5, ఆదిలాబాద్‌లో 34, కనిష్టంగా 24 డిగ్రీలు, భద్రాచలంలో గరిష్టంగా 32.6, కనిష్టంగా 26.5, హనుమకొండలో గరిష్టంగా 32.5, కనిష్టంగా 24.5, ఖమ్మంలో గరిష్టంగా 34.2, కనిష్టంగా 27, మహబూబ్‌నగర్‌లో గరిష్టంగా 31.8, రికార్డు సగటున 25 డిగ్రీలు నమోదయ్యాయి.
World Cup Qualifiers 2023: వన్డే క్రికెట్‌లో జింబాబ్వే సరికొత్త రికార్డు.. పాకిస్తాన్ కూడా సాధించలేకపోయింది!

Exit mobile version