Heavy Rains In Telangana In 3 Days: తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురవొచ్చని పేర్కొంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణ్ పేట్, సంగారెడ్డి, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో.. కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. గంటకు 41 నుంచి గరిష్ఠంగా 61 కిలోమీటర్ల వేగంతో ఈదులు గాలులు వీచే ఛాన్స్ ఉందని తెలిపింది. అక్కడక్కడా పిడుగులు పడే ప్రమాదం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దిగువ స్థాయిలోని గాలులు దక్షిణ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి వీస్తున్నాయని పేర్కొంది.
Boat Accident: విషాదం.. బీచ్ వద్ద పడవ బోల్తా.. 21 మంది దుర్మరణం
బంగాళాఖాతంలో ఉపరితల అవర్తనం ఏర్పడిందని, ఇది 8న అల్పపీడనంగా మారుతుందని, ఆ మరుసటి రోజున ఇది వాయుగుండంగా మారొచ్చని వాతావరణ శాఖ చెప్పింది. ఈ ఉపరితల ఆవర్తనం.. ఆదివారం ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లోని అండమాన్ సముద్రంలో కొనసాగుతూ, సగటు సముద్ర మట్టం నుంచి మధ్య ట్రోపోస్పిరిక్ స్థాయి వరకు ఉందని వివరించింది. దీని ప్రభావంతో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. ఇది ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లోని అండమాన్ సముద్రంలో 9న వాయుగుండంగా కేంద్రీకృతం అవ్వొచ్చని, ఆ తర్వాత ఉత్తరం దిశగా పయనిస్తూ మధ్య బంగాళాఖాతం పరిసరాల్లోని అండమాన్ సముద్రం వైపునకు కదులుతూ తీవ్ర తుఫాను బలపడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. అల్పపీడనంగా మారిన తర్వాత ఈ తుపాను దిశ, వేగం, తీవ్రత, ప్రయాణించే మార్గం తెలుస్తాయని.. దీని వల్ల తెలంగాణ 9వ తేదీ నుంచి గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని.. కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు దాదాపుగా 40 నుంచి 43 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపింది.
SRH vs RR: బ్రతికించిన ఫ్రీ హిట్.. ఆర్ఆర్‌పై ఎస్ఆర్‌హెచ్ సంచలన విజయం
కాగా.. ఇప్పటికే కురిసిన వర్షాల కారణంగా తెలంగాణలో చాలా ఆస్తినష్టం జరిగింది. హైదరాబాద్ నగరంతో పాటు లోతట్టు ప్రాంతాలు నిండిపోతుండగా.. భారీ పంట నష్టం వాటిల్లింది. గతంలో మునుపెన్నడూ లేని స్థాయిలో పంట నష్టం జరిగిందని.. మంత్రి గంగులా కమలాకర్ కూడా చెప్పుకొచ్చారు. అయితే.. ధాన్యం తడిసినా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పి, రైతులకు భరోసా ఇచ్చారు. ఆ సంగతులు పక్కనపెడితే.. ఇప్పుడు మళ్లీ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో, రైతులు ఆందోళన చెందుతున్నారు.