TS Rain: తెలంగాణలో రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS Rain: హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తుండగా.. కొన్ని రోజులుగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అయితే రానున్న మూడు రోజుల్లో కూడా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఇవాళ హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగాం, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, అస్మానాబాదు, నిర్మల్, నిర్మల్ , ఆదిలాబాద్, జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. రేపు కూడా హైదరాబాద్‌తో పాటు సిద్దిపేట, పెద్దపల్లి, కరీంనగర్, కామారెడ్డి, జనగాం, రాజన్న సిరిసిల్ల, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Read also: Bike Romance: కదులుతున్న బైకుపై సరసాలు.. తిట్టిపోస్తున్న నెటిజన్లు
Also Read
ఈనెల 20 నుంచి 21వ తేదీ వరకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. 20వ తేదీన మంచిర్యాల, నిజామాబాద్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, ఖమ్మం, పెద్దపల్లి, జగిత్యాల, కొమరం భీమ్ ఆసిఫాబాద్ ఆదిలాబాద్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. . 21న ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే 22న పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. నిన్న ములుగు జిల్లాలో 8.0, నిజామాబాద్ జిల్లాలో 7.7, ఆదిలాబాద్ జిల్లాలో 6.4, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 6.2, నిర్మల్ జిల్లాలో 5.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Adhika Sravana Masam: అధిక శ్రావణమాసం ఈ స్తోత్రాలు వింటే విశేష ఫలం దక్కుతుంది
తాజావార్తలు
-
Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
-
Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
-
Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
ట్రెండింగ్
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్‌లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్‌తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్‌కు భారీ షాక్.. ప్రపంచ కప్‌కు మ్యాచ్ విన్నర్ దూరం!