NTV Telugu Site icon

Rain Alert: వరుసగా 5 రోజులు వాన.. పలు ప్రాంతాల్లో జోరుగా వర్షాలు..

Rain Alert

Rain Alert

Rain Alert: ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే వచ్చాయి. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అందుకు తగ్గట్టుగానే జూన్‌ ప్రారంభం నుంచి వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించారు. గత నాలుగైదు రోజులుగా తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని వాతావరణ శాఖ తెలంగాణకు వర్ష హెచ్చరిక జారీ చేసింది.

Read also: Viral Video: ఎంతకు తెగించార్రా.. నడిరోడ్డుపైనే ముద్దులతో రెచ్చిపోయిన ఆంటీ-అంకుల్!

రానున్న ఐదు రోజుల పాటు అంటే నేటి నుంచి జూన్ 25 వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలకు తోడు ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. అలాగే గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. వ్యవసాయం, ఇతర పనుల నిమిత్తం బయటకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

Read also: Weather updates: వానలు పడుతున్న ఉక్కపోత మాత్రం తగ్గట్లే..!!

ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుందని చెబుతున్నారు. సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఈ కాలం కొనసాగుతోందని తెలిపారు. దీని ప్రభావంతో తెలంగాణతో పాటు ఏపీలో కూడా వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. ఆసిఫాబాద్, ములుగు, కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ మేరకు వాతావరణ శాఖ అధికారులు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. మంగళవారం తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సాయంత్రం, రాత్రి వర్షం కురిసింది. బుధవారం ఉదయం నుంచి నగరంలో వాతావరణం మేఘావృతమై ఉంది. భారీ వర్షాల కారణంగా రోడ్లపై నీరు నిలిచి ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రమాదం ఉన్నందున ప్రజలు అవసరమైతే మాత్రమే బయటకు రావాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు.
Lok Sabha Speaker: ఓం బిర్లా మళ్లీ లోక్‌సభ స్పీకర్ అవుతారా?.. జాబితాలో వీరి పేర్లు!

Show comments