Rain Alert: వరుసగా 5 రోజులు వాన.. పలు ప్రాంతాల్లో జోరుగా వర్షాలు..
- ముందుగానే రాష్ట్రానికి నైరుతి రుతుపవనాలు..
- భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక..
- జూన్ ప్రారంభం నుంచి విపరీతంగా కురుస్తున్న వర్షాలు..
- ఇప్పటికే ఏపీ- తెలంగాణలోభారీ వర్షాలు..
- తెలంగాణకు వర్ష హెచ్చరిక జారీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rain Alert: ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే వచ్చాయి. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అందుకు తగ్గట్టుగానే జూన్ ప్రారంభం నుంచి వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించారు. గత నాలుగైదు రోజులుగా తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని వాతావరణ శాఖ తెలంగాణకు వర్ష హెచ్చరిక జారీ చేసింది.
Read also: Viral Video: ఎంతకు తెగించార్రా.. నడిరోడ్డుపైనే ముద్దులతో రెచ్చిపోయిన ఆంటీ-అంకుల్!
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
రానున్న ఐదు రోజుల పాటు అంటే నేటి నుంచి జూన్ 25 వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలకు తోడు ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. అలాగే గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. వ్యవసాయం, ఇతర పనుల నిమిత్తం బయటకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
Read also: Weather updates: వానలు పడుతున్న ఉక్కపోత మాత్రం తగ్గట్లే..!!
ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుందని చెబుతున్నారు. సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఈ కాలం కొనసాగుతోందని తెలిపారు. దీని ప్రభావంతో తెలంగాణతో పాటు ఏపీలో కూడా వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. ఆసిఫాబాద్, ములుగు, కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ మేరకు వాతావరణ శాఖ అధికారులు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. మంగళవారం తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సాయంత్రం, రాత్రి వర్షం కురిసింది. బుధవారం ఉదయం నుంచి నగరంలో వాతావరణం మేఘావృతమై ఉంది. భారీ వర్షాల కారణంగా రోడ్లపై నీరు నిలిచి ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రమాదం ఉన్నందున ప్రజలు అవసరమైతే మాత్రమే బయటకు రావాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు.
Lok Sabha Speaker: ఓం బిర్లా మళ్లీ లోక్‌సభ స్పీకర్ అవుతారా?.. జాబితాలో వీరి పేర్లు!
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!