Telangana Rains: తెలంగాణలో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న సాయంత్రం నుంచి హైదరాబాద్ లోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. చిన్నపాటి వర్షానికే నగరం తడిసి ముద్దయింది. పలు చోట్ల రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాలు నీట మునిగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో మంగళవారం కూడా వర్షం కురిసింది. అయితే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో వచ్చే వారం పాటు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ నిన్న రాత్రి వాతావరణ బులెటిన్‌ను విడుదల చేసింది. పలు జిల్లాల్లో ఐదు రోజుల పాటు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. సూర్యాపేట, ఖమ్మం, ములుగు, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
Read also: Tirupathi: హైదరాబాద్-తిరుపతి మార్గంలో డైనమిక్ టికెటింగ్ సిస్టం.. రద్దీని బట్టి పెరగనున్న ఛార్జీలు
రేపు హనుమకొండ, మంచిర్యాల, వరంగల్, మహబూబాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, నిర్మల్, పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 14, 15, 16 తేదీల్లో దాదాపు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. హైదరాబాద్‌లో ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండగా, ఈరోజు సాయంత్రం లేదా రాత్రి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. భారీ వర్షాలు కురిసే సమయంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. మంగళవారం కొమరం భీం జిల్లా జైనూర్‌లో 126.2, వాంక్డిలో 124.2, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో 118.6, ములుగు జిల్లా తడ్వాల్‌లో 112, వరంగల్ జిల్లా నర్సంపేటలో 88.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిన్న నల్గొండలో గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీలు , కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ గా ఉండి ఆకాశం పాక్షికంగా మేఘావృతమై చిరుజల్లులు పడే అవకాశం ఉంది. దాదాపు అన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్‌లో గరిష్టంగా 32.9 డిగ్రీలు, కనిష్టంగా 24.4 డిగ్రీలు నమోదైంది. భారీ వర్షాల నేపథ్యంలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో రాష్ట్రంలో చలి వాతావరణం నెలకొంది.
North Korea: బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా