భాగ్యనగరంపై మరో సారి వరుణుడు తన ప్రతాపాన్ని చూపించాడు. నగరంలో అర్థరాత్రి 12 గంటలు దాటాక పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. నగరంలోని ఖైరతాబాద్, బంజారాహిల్స్, నాంపల్లి, పాతబస్తీ, కోఠి, అబిడ్స్, మలక్ పేట, దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట, ఎల్బీనగర్, హయత్‌నగర్, హిమాయత్‌నగర్, నారాయణగూడ, ముషీరాబాద్, కాప్రా, హెచ్‌బీ కాలనీ, కుషాయిగూడ, రాయదుర్గం, ఖాజాగూడ తదితర ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై వాన నీరు నిలవడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు.
మళ్లీ వానలు కురస్తుండటంతో.. లోతట్టు ప్రాంతాల ప్రజలు భయంభయంగా గడుపుతున్నారు. రాత్రి ఊహించని విధంగా కురిసిన వర్షానికి, అర్ధరాత్రి సమయంలో ఇళ్లకు వెళుతున్నవారు తడిసి ముద్దయి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాన ధాటికి.. ముసారాంబాగ్ వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో.. ముసారాంబాగ్ నుంచి గోల్నాక వైపు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక మలక్‌పేట వంతెన కింద భారీగా వరద నీరు నిలిచిపోవడంతో.. వంతెనపై నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. వర్షానికి పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. వరద నీటిని మళ్లించేందుకు జీహెచ్‌ఎంసీ సిబ్బంది శ్రమిస్తున్నారు. ఇక ఎల్బీనగర్ పరిధి చింతల్‌కుంట వద్ద జాతీయ రహదారిపై మోకాల్లోతు నీరు నిలిచింది. హైదరాబాద్ లోని మలక్ పేటలో 8.9సెం.మీ., సైదాబాద్ కూర్మగుడాలో 8.8సెం.మీ., బహదూర్ పుర 8.7సెం.మీ., సిద్దిపేట కోమరవేల్లిలో 8.6సెం.మీ., ఛార్మినార్ 8.5సెం.మీ., నారాయణగూడ 8.5సెం.మీ. వర్షం కురింది.
జిల్లాల్లో భారీ వర్షం
రంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి, సిద్దిపేట జిలాల్లో భారీ వర్షం కురిసింది. వికారాబాద్ లో 12.6 సెం.మీ., యాదాద్రి జిల్లా భువనగిరి 10.8సెం.మీ., సిద్దిపేట జిల్లా అంగడి కిష్టాపూర్ లో 10.6 సెం.మీ., రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ 10.5 సెం.మీ., సంగారెడ్డి జిల్లా జిన్నారంలో 9.7సెం.మీ., వర్షపాతం నమోదైంది. ఇవాళ పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. ఇక, రేపు, ఎల్లుండి అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది..
Canada: కెనడాలో కాల్పులు.. ఇద్దరు భారతీయ సంతతి వ్యక్తుల మృతి
