Heavy Rain in Hyderabad: నగరాన్ని ముంచెత్తిన వాన.. వాగులుగా మారిన వీధులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heavy Rain in Hyderabad: ఢిల్లీ, గురుగ్రామ్, ముంబై, బెంగళూరు తర్వాత ఈసారి హైదరాబాద్‌లో వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో జడివాన నగర ప్రజలను వణికించింది. వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. అపార్ట్మెంట్ లు వర్షపునీటితో సెల్లార్లను నిండిపోయింది. సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో నగరంలోని వీధులన్నీ పొంగిపొర్లుతున్నాయి. దీంతో హైదరాబాద్‌లోని బోరబండ, సంజీవరెడ్డినగర్, కృష్ణానగర్‌లో ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంతో పాటు వర్షం ప్రవాహంలో కొట్టుకుపోయాడు.
Also Read
ఇక సికింద్రాబాద్, చిలకలగూడ, బేగంపేట, పంజాగుట్ట పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పటాన్‌చెరువు, రామచంద్రాపురం, సేరిలింగంపల్లి, మియాపూర్, కూకట్‌పల్లి, మాదాపూర్, కొండాపూర్, కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ, నిజాంపేట్, ప్రగతినగర్, హైదర్‌నగర్ తదితర ప్రాంతాల్లో ప్రజానీకాన్ని ముప్పు తిప్పలు పెట్టించింది. ఎర్రగడ్డ, మూసాపేట, బాలానగర్, బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, తిరుమలగిరి, బేగంపేట, ప్యాట్నీ, కోఠి, సుల్తాన్‌బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్‌బాగ్, నారాయణగూడ, లక్డీకపూల్, అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట పరిసరాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. ఉస్మాన్ సాగర్ ఇన్ ఫ్లో 900 క్యూసెక్కులు. దీంతో అధికారులు 4 గేట్లను ఎత్తి 952 క్యూసెక్కుల ప్రవాహాన్ని మూసివేసిన రీతిలో విడుదల చేశారు. హిమాయత్ సాగర్ కు 1200 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. రెండు గేట్లను ఎత్తి 1373 క్యూసెక్కులు వదిలేలా చర్యలు చేపట్టారు.
హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షాలు
బాలానగర్ 10.4cm, బొల్లారం 9.6cm, తిరుమల గిరి 9.5cm, వెస్ట్ మరేడుపల్లి 9.3cm, కుత్బుల్లాపూర్ 9.2cm, కూకట్ పల్లి 7.7 cm, ముసాపేట 7.6cm, కొండాపూర్ 7.4cm, మొండా మార్కెట్ 7.2cm, మల్కాజిగిరి 7cm..
తెలంగాణలో పలు జిల్లాలో చోట్ల భారీ వర్షం కురిసింది.
సిద్దిపేట జిల్లా రామారం 16 cm, సంగారెడ్డి జిల్లా కిష్టారెడ్డి పేట లో 13.4cm,
రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం పొద్దుటూరులో10.4cm, రంగారెడ్డి జిల్లా కొత్తూరు లో 9.2 cm,
#WATCH | Hyderabad: A person in the Borabanda area along with his two-wheeler washed away, rescued by locals, as heavy rain lashes the city pic.twitter.com/kbTpef43jt
— ANI (@ANI) October 12, 2022
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్‌కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!