Site icon NTV Telugu

Hyderabad Rains: మళ్లీ వరుణుడి ప్రతాపం.. మరో మూడు రోజుల పాటు..!

Heavy Rains

Heavy Rains

Hyderabad Rains: హైదరాబాద్‌లో మరోసారి వరుణుడు తన ప్రతాపాన్ని చూపించాడు. ఇవాళ ఉదయం నుంచి కురిసిన వర్షానికి నగరవాసులు తడిసిముద్దయ్యారు. భారీ వర్షం వల్ల రోడ్లు జలమయమయ్యాయి. రోడ్లపైకి నీరు రావడంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో రానున్న మరో మూడ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయని పేర్కొంది. దక్షిణ తెలంగాణలో అతి భారీవర్షాలు.. ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వివరించింది.

ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ నివేదించింది. నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు కొన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 28డిగ్రీలు, 21డిగ్రీలు ఉండనున్నట్లు తెలిపింది. ఉత్తర దిశల నుంచి గాలులు గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

Thieves Hulchul: రెచ్చిపోయిన దొంగలు.. హుండీ పగలగొట్టడానికి రెండు గంటల పాటు విఫలయత్నం

దీంతో పాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో వర్షం మరోసారి బీభత్సం సృష్టించింది. మహబూబ్‌నగర్‌ పట్టణంలోని రామయ్యబౌలి, శివశక్తి నగర్, బీకే రెడ్డి కాలనీ, భగరీథ కాలనీల్లోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఇళ్లల్లోకి నీరు చేరటంతో చేరింది. పాలమూరు పట్టణం నుంచి వచ్చే వరద నీరంతా పెద్దచెరువులో చేరకుండా నేరుగా కాల్వల ద్వారా బయటకు పంపుతుండటంతో మురుగునీరు రోడ్లపైకి చేరుతోంది. ఫలితంగా ఇళ్లలోకి నీరు వచ్చి ప్రజలు అవస్థలు పడుతున్నారు.

Exit mobile version