NTV Telugu Site icon

Hyderabad Rain: నగరాన్ని ముంచెత్తిన వాన.. ట్రాఫిక్ పోలీసులు అలర్ట్

Hyderabad Rain

Hyderabad Rain

భాగ్య నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి నగరాన్ని మేఘాలు కమ్ముకున్నాయి. నగరం పూర్తిగా కారుమబ్బులతో పూర్తిగా చీకటిమయంగా మారింది. ఉదయం 8 గంటల నుంచి అక్కడక్కడ చిరజల్లులు కురుస్తున్నాయి. నేడు నగరంలో భారీ వర్షాలు పడే అవకాశం వుందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు అలర్ట్‌ అయ్యారు. నగర ప్రజలకు పలు సూచనలు జారీ చేసారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు భారీగా వర్షం పడే అవకాశం వుందని, ఈ సమయంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాహనదారులు గంట ఆలస్యంగా తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని పేర్కొన్నారు.

read also: Common Wealth Games 2022: కొనసాగుతున్న భారత క్రీడాకారుల హవా.. 9కి చేరిన పతకాల సంఖ్య

వర్షం తగ్గిన గంట తర్వాత వాహనదారులు బయటికి రావాలని ప్రకటించారు. వరద నీరు భారీగా రోడ్లపై చేరితే ట్రాఫిక్కు అంతరాయం కలిగే అవకాశం వుందని, కొన్ని ముఖ్యమైన రోడ్లలో వాహనదారులు ఇతర మార్గాలను వెళ్లాల్సిన అవసరం వుందని జాయింట్ సీపీ సూచించారు. అయితే.. ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల మధ్య 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితలద్రోణి ఏర్పడింది. ఇది ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ మీదుగా శ్రీలంక సమీపంలో కోమరీన్‌ ప్రాంతం వరకూ విస్తరించింది. కాగా..మరోవైపు తమిళనాడుపై 1500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడి.. రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయి. వీటి ప్రభావం వల్ల నేడు ఒక మోస్తరుగా, బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది.

Ukraine Crisis: ఎట్టకేలకు కదిలిన ఆహార నౌక.. ఇదే మొదటిది!

నిన్న నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. సోమవారం ఉదయం నుంచి వాతావరణంలో మార్పులు కనిపించింది. ఉదయం కాస్త ఎండ నగరాన్ని తాకిన ఉదయం 10.45 గంటల నుంచి వర్షం ముంచెత్తింది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, లక్డీకపూల్‌, ఎస్‌ఆర్‌ నగర్‌, కూకట్‌పల్లిలో కుండపోత వర్షం కురుస్తోంది. గండిపేట, బండ్లగూడ, రాజేంద్రనగర్‌, గచ్చిబౌలి,షేక్‌పేట, మణికొండ, బషీరాబాద్‌, చిక్కడపల్లి, రాంనగర్‌, కవాడిగూడ, దోమల్‌గూడ, భోలక్‌పూర్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, జవహర్ నగర్, గాంధీనగర్‌, షేక్‌పేట, రాయదుర్గం, రాజేంద్రనగర్‌, కిస్మత్‌పురా, సికింద్రాబాద్‌, బేగంపేట, దిల్‌సుఖ్‌నగర్‌, చాదర్‌ఘాట్‌ ఎల్బీనగర్‌, వనస్థలిపురంతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.