Site icon NTV Telugu

హైదరాబాద్‌లో కుండపోత వర్షం

Rain

Rain

హైదరాబాద్‌లో మరోసారి కుండపోత వర్షం కురుస్తోంది… బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, కూకట్‌పల్లి, ఆల్విన్‌ కాలనీ, జగద్గిరిగుట్ట, అబిడ్స్, కోఠి, బేగంబజార్, నాంపల్లి, బషీర్‌బాగ్‌ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం దంచి కొట్టింది… దీంతో.. ప్రధాన రహదారులపై వరద నీరు పొంగిపొర్లుతోంది.. లోతట్టు ప్రాంతాలు, ప్రధాన జంక్షన్లలో సైతం రోడ్లపైకి భారీగా వర్షం నీరు చేరింది.. దీంతో.. పలుచోట్ల ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఎదురైంది. గత వారం దంచికొట్టిన వానలు.. వారాంతంలో కాస్త తెరపిఇచ్చాయి. కానీ, ఉన్నట్టుండి ఇవాళ వాతావరణం మారిపోయింది.. భారీ వర్షం కురిసింది. మరోవైపు.. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా.. ముందస్తు చర్యలను పూనుకున్నారు.

Exit mobile version