
హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి పొడిగా, ఎండగా ఉన్న వాతావరణం మధ్యాహ్నం వరకు మారిపోయింది. మధ్యాహ్నం నుంచి వాతావరణం ఒక్కసారిగా చల్లబడి వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లోని రోడ్లు జలమయం అయ్యాయి. వర్షం కురిసే ముందు ఈదురుగాలులు వీయడంతో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వాతావరణం చల్లబడటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు.