నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో ఇటు రైతులు, అటు తెలంగాణ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏరువాకకు సిద్ధం కావాల్సిన రైతులు రుతుపవనాల కోసం ఎదురుచూస్తుంటే.. భానుడి భగ భగల నుంచి ఉపశమనం కోసం తెలంగాణ వాసులు ఎదురుచూస్తున్నారు. అయితే వీరి నిరీక్షణకు తెర దించే విధంగా సోమవారం సాయంత్రం తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. తెలంగాణలోని మహబూబ్‌నగర్ వరకు విస్తరించిన రుతుపవనాలు మరో రెండు రోజుల్లో పూర్తిగా విస్తరిస్తాయని తెలంగాణ వాతావరణ శాఖ వెల్లడించింది.
అయితే.. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దీంతో హైదారాబాద్‌లోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. దీంతో.. వేడి, ఎండ తీవ్రత నుంచి నగర వాసులు కాస్త ఉపశమనం లభించింది. నగరంలోని కూకట్‌పల్లి,బాచుపల్లి,నిజాంపేట, జీడిమెట్ల, షాపూర్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. రాహదారులు జలమయవడంతో.. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంతేకాకుండా పలుచోట్ల విద్యుత్‌కు అంతరాయం కలిగింది.
