NTV Telugu Site icon

TS Rains: నైరుతి బంగాళాఖాతంలో మరో ఆవర్తనం.. తెలంగాణకు భారీ వర్షసూచన

Ts Rains

Ts Rains

TS Rains: తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర తమిళనాడు తీరానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో సోమవారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ప్రస్తుతం సముద్ర మట్టానికి 5.8 కి.మీ. దీంతో పాటు నైరుతి రుతుపవనాల ప్రభావంతో రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేశారు. రేపు కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే 13, 14 తేదీల్లో ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నిర్మల్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Read also: Banjara Hills: బయట స్పా సెంటర్ బోర్డు.. లోపల నిరుద్యోగులతో వ్యభిచారం

ఇక 15వ తేదీన మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కొమరం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కానీ నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉత్తరాది రాష్ట్రాలు భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు కార్లు కొట్టుకుపోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు పడడం లేదు. తెలంగాణలో ఇప్పటి వరకు సాధారణం కంటే 36 శాతం లోటు వర్షపాతం నమోదైంది. అయితే రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో సూర్యాపేట జిల్లా చిల్కూరులో 45.4, కోదాడలో 27.2, ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో 32.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
TNPL 2023: తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌లో సంచలనం.. 5 బంతుల్లో ఐదు సిక్సర్లు! మరో రింకూ సింగ్‌

Show comments