Heavy Rain Telangana: తెలంగాణలో రెండురోజుల పాటు మళ్ళీ వారణుడు తన ప్రతాపాన్ని చూపనున్నాడు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక, చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని, కొన్నిచోట్ల అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని.. ఉరుములు, మెరుపులతో కూడిన వానతో పాటు కొన్నిచోట్ల పిడుగులు కూడా పడతాయని హెచ్చరించింది. కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనమే ఈవర్షాలకు కారణమని హైదరాబాద్ వాతావరణ హెచ్చరికల కేంద్రం వివరించింది.
Read also: Kodali Nani: మళ్లీ అలాంటి దుస్థితి రాకూడదనే.. మూడు రాజధానులు
నిన్న హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉప్పల్, పీర్జాదిగూడ, తార్నాక తదితర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వాహనదారులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు భారీ వర్షంతో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు కాలనీలు చెరువులను తలపించాయి. ఇక.. అంబర్‌పేట, ముసారంబాగ్, మలక్‌పేటలోనూ భారీవర్షం కురిసినట్లు అధికారులు పేర్కొన్నారు. నగరంలోని.. చంపాపేట్, ఐఎస్ సదన్, సంతోష్‌నగర్, సైదాబాద్, చాదర్‌ఘాట్, కోఠిలో భారీ వర్షం పడింది. భారీ వర్షానికి.. మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో భారీ వర్షానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలో భారీ కుండపోత వర్షం కురిసింది. పాత చెరువుకు వెళ్లే కలుకట్ట తెగిపోవడంతో పలు కాలనీలు జలమయ్యాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో.. మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డి, కమిషనర్, సిబ్బంది తక్షణ సహాయక చర్యలు చేపట్టారు. రాత్రి కురిసిన భారీ వర్షానికి ధరూర్ మండలం తరిగోపుల గ్రామంలో పంట పొలాల నుండి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇండ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు.
వికారాబాద్ జిల్లా పెద్ద ఉమ్మెంతాల్ లో 12 cm కాగా, వికారాబాద్ జిల్లా పరిగిలో 10.5 cm. వికారాబాద్ లో 10cm వర్షపాతం నమోదైంది. వికారాబాద్ జిల్లా ధారురు మండలం నాగారం వద్ద వాగులో కారు గల్లంతైంది. కారు డ్రైవర్ వాగు ప్రవాహ వేగాన్ని చూసుకోకుండా దాటించే ప్రయత్నం చేయడంతో ఈప్రమాదం జరిగింది. అయితే నీటి ప్రవాహానికి చెట్టును ఢీకొట్టడంతో అక్కడే వున్న చెట్టును పట్టుకొని కారులో ప్రయాణికులు గట్టెక్కారు. కారులో ఉన్న ఇద్దరు సురక్షితంగా బయట పడ్డారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో అరగంట నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షపునీరు రోడ్డుపై చేరడంతో ఇబ్బంది పడుతున్న వాహనదారులు. భారీ వర్షానికి కామారెడ్డి కొత్త బస్టాండ్ ఆవరణం జలమయమైంది. కొత్త బస్టాండ్ లో వ్యాపారం నిర్వహించే వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.